हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ustaad Bhagat Singh: ప‌వ‌న్‌ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’పై క్రేజీ అప్‌డేట్‌

Ramya
Ustaad Bhagat Singh: ప‌వ‌న్‌ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’పై క్రేజీ అప్‌డేట్‌

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ముహూర్తం ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ఎట్టకేలకు ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న హరీశ్ శంకర్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో తన కొత్త ప్రయత్నానికి ముహూర్తం పెట్టుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న హరీశ్ (Harish), అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జూన్ రెండో వారంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. ఈ వార్తతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాంచి జోష్‌కి వచ్చారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ పట్ల వస్తున్న అనేక రూమర్లకు ఈ ప్రకటన చెక్ వేసింది.

మళ్లీ గబ్బర్ సింగ్ మ్యాజిక్‌కి సిద్ధమవుతున్న హరీష్ – పవన్

గతంలో పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హరీశ్‌, ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా షెడ్యూల్ సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్, శ్రీలీల (Srilila) పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిర్మాణ వర్గాల సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లో పవన్ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. 

Ustaad Bhagat Singh

రూమర్లకు తెరదించిన పోస్టర్ – పవన్ హనుమంతుడి లాకెట్‌తో దద్దరిల్లిన సోషల్ మీడియా

కొంతకాలంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఆ పోస్టర్‌లో పవన్ హనుమంతుడి లాకెట్ ధరించి, దర్శకుడు హరీశ్‌ శంకర్ చేతిని పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌తో సినిమా ఆగిపోలేదని, త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

2026కి రిలీజ్ పక్కా? – మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2025 దీపావళికి విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం 2026లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓజీ, హరిహర వీరమల్లు.. షూటింగ్‌ల మధ్య ఉస్తాద్!

కాగా, పవన్ ప్రస్తుతం ముంబైలో ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ కూడా ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ఇటీవ‌లే పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇక‌, ప‌వ‌ర్‌స్టార్‌ నటించిన మరో భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు-పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read also: Veeraraj 1991: ‘వీరరాజు 1991’ (ఆహా) సినిమా రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870