📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Trailer Release: శుభం మూవీ ట్రైల‌ర్ విడుదల

Author Icon By Anusha
Updated: April 27, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా మెప్పించిన సామ్ ఈ మ‌ధ్య సినిమాలు కాస్త త‌గ్గించింది. మ‌యోసైటిస్ వ‌ల‌న రెండేళ్ల‌ పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు మ‌ళ్లీ వాటిపై ఫోక‌స్ పెట్టింది. ఎట్ట‌కేల‌కి స‌మంత న‌టిగాను, నిర్మాత‌గాను అల‌రించేందుకు సిద్ధ‌మైంది.ఇప్పుడిప్పుడే తిరిగి సినీరంగంలో యాక్టివ్ అవుతున్న సామ్ అటు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇటు ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్నాళ్ల క్రితమే ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది సామ్ఇ దిలా ఉంటే.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా నిర్మించిన శుభం చిత్రం మే 9న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.ఈ క్ర‌మంలోనే తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్‌తో కథ ఏంటో సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఊర్లోని మహిళలంతా రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే సీరియల్‌కు అతుక్కు పోతుంటారు. అలా చూస్తూ దెయ్యాల్లా మారిపోతారు. ఇక ఇంట్లో మగాళ్లకి రక్షణ కరువు అవుతున్న స‌మ‌యంలో ఓ మాతగా సమంత కనిపిస్తుంది.

కామెడీ ఎంటర్ టైనర్

మాత స‌మంత వారిని ఎలా ర‌క్షిస్తుంది? అసలు మహిళలంతా అలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తారు? అన్న పాయింట్లే సినిమాలో చూపించబోతున్న‌ట్టు ట్రైల‌ర్‌ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. సమంత డిఫరెంట్ రోల్‌లో దెయ్యాలను వదిలించే మాతగా కనిపించ‌డం, భర్తలందరూ తమ భార్యలు దెయ్యాలుగా మారడాన్ని తట్టుకోలేక ఆవిడ దగ్గరకు వెళ్లి ‘మాతా ఇప్పుడు మా అందరికీ ఏం జరగబోతోంది?’ అని ప్రశ్నించ‌డం, సమంత సైగలతో చేసే ఎక్స్‌ప్రెషన్స్ అయితే మూవీపై ఆస‌క్తిని పెంచాయి.పెద్ద‌ క్యాస్టింగ్ లేకుండా దాదాపు అందరూ కొత్తగా వాళ్ళతో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో వెరైటీ పాయింట్ తీసుకోవ‌డం ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించింది. ప్రవీణ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి హిట్ అవుతుంద‌ని అంటున్నారు. సమంతది ప్రాధాన్యం కలిగిన గెస్టు రోల్ గా కనిపిస్తోంది. సస్పెన్స్ లో పెట్టకుండా ఆమె క్యారెక్టర్ ని రివీల్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కు ముందే హింట్ ఇచ్చారు. షోర్ పోలీస్ సంగీతం సమకూరుస్తున్న శుభంకు మొత్తం యూత్ టాలెంట్ పని చేశారు. సమంత సమర్పణలో ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ మీద శుభం అనే సినిమా రాబోతోంది. రాజ్ నిడుమోరి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే స‌మంత మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంద‌ని అంటున్నారు

Read Also : Actor: చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి :సూర్య

#HorrorThriller #MoviePromotion #Samantha #ShubhamMovie #ShubhamTrailer Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.