हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Sai pallavi: కుబేర సినిమాపై సాయి పల్లవి ట్వీట్

Ramya
Sai pallavi: కుబేర సినిమాపై సాయి పల్లవి ట్వీట్

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి (Sai pallavi) ఫుల్ జోష్ మీదుంది. గతేడాది అమరన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన కుబేర సినిమాపై సాయి పల్లవి చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

కుబేరపై సాయి పల్లవి ప్రశంసలు

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా కుబేర. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలలో నటించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌లతో భారీ హైప్‌ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈరోజు, శుక్రవారం (జూన్ 20), ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ‘కుబేర’ సినిమాపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఆమె ట్వీట్‌లో, “కుబేర సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, సవాలుతో కూడుకున్న పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ధనుష్, మరోసారి తన అద్భుతమైన నటనతో కట్టిపడేయనున్నారు. అలాగే, డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అగ్ర హీరో నాగార్జున ఇలాంటి పాత్రలో చూడటం అభిమానులకు కనులవిందు. శేఖర్ తెరకెక్కించే చిత్రాల్లో హీరోయిన్స్ పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఇందులో రష్మిక పోషించే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్న ఆమెకు ఈ సినిమా మరో విజయాన్ని అందించనుంది.” అంటూ ప్రశంసలు కురిపించింది.

గురువు శేఖర్ కమ్ములకు సాయి పల్లవి శుభాకాంక్షలు

సాయి పల్లవి తన ట్వీట్‌లో ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై కూడా ప్రశంసలు కురిపించింది. “రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi sri prasad).. మీ కెరీర్‌లోని బెస్ట్ ఆల్బమ్స్‌లో ఇదీ ఒకటి. ఈ సినిమా కోసం చెమటోడ్చిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు అందాలని కోరుకుంటున్నాను” అని పేర్కొంది.

ఆమె తన గురువు, దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “స్వచ్ఛమైన హృదయం, అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి, నాకెంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. తన కథలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. అలా ప్రేరణ పొందిన వారిలో నేనూ ఒకదాన్ని. నా గురువు.. ఎప్పుడూ సంతోషం, ఆయురారోగ్యాలతో జీవించాలని.. ఇలాంటి అద్భుతమైన కథలెన్నో మనకు అందించాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్ ఆనందం కోసం నేను ప్రార్థిస్తున్నాను” అంటూ శేఖర్ కమ్ములపై తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకుంది.

శేఖర్ కమ్ముల – సాయి పల్లవి విజయవంతమైన ప్రయాణం

శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో గతంలో అనేక హిట్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సైతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలతో తెలుగులో సాయి పల్లవికి మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో, సాయి పల్లవి తన గురువు సినిమాపై చేసిన ఈ ట్వీట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read also: Karuppu: ‘క‌రుప్పు’ నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870