📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Janhvi Kapoor: రామ్‌చరణ్‌పై జాన్వీ కపూర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, (Janhvi Kapoor) ఇప్పటివరకు హిందీ చిత్రాలలో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయినా, తన గ్లామర్‌ ప్రెజెన్స్‌, కృషి, నటనతో నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఆమె దృష్టి మొత్తం సౌత్ ఇండస్ట్రీ (South Industry) పై పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని ఆమె కృతనిశ్చయంతో ముందుకు వెళుతోంది.

Bigg Boss 9: హాటు హాటుగా కొనసాగుతున్న నామినేషన్స్

జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ‘దేవర’ సినిమా (‘Devara’ movie) తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు నెరవేర్చిన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే సినిమాలో జాన్వీ పాత్ర చిన్నదిగా ఉండటంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

Janhvi Kapoor

ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సరసన నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. రామ్‌చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రతి సన్నివేశంలో నేను రియలిస్టిక్‌గా నటించేందుకు ప్రయత్నించా

తాజాగా జాన్వీ కపూర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “పెద్ది నా కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుంది. ఇందులో నేను సంప్రదాయ హీరోయిన్ (heroine) పాత్రలో కాకుండా, ఒక కొత్త కోణం కలిగిన, భిన్నమైన క్యారెక్టర్ పోషిస్తున్నాను. ప్రతి సన్నివేశంలో నేను రియలిస్టిక్‌గా నటించేందుకు ప్రయత్నించాను. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉంది” అని పేర్కొంది.

ఇక రామ్‌చరణ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిం జాన్వీ కపూర్. ‘రామ్‌చరణ్ ఎంత పెద్ద స్టార్ అయినా సెట్‌లో నిత్య విద్యార్థిలా కష్టపడతారు. ఆయన చూపించే డెడికేషన్,ఎనర్జీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ‘పెద్ది’ సెట్‌లో మళ్లీ ఎప్పుడు అడుగుపెడతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) చాలా టాలెంటెడ్’.

ఏడేళ్లయినా బాలీవుడ్ హిట్టు మొహం చూడలేదు

‘ఉప్పెన’లాంటి హార్ట్ టచ్చింగ్ మూవీకి దర్శకత్వం వహించిన వ్యక్తితో పనిచేయడం గొప్ప అనుభూతి’ అని చెప్పుకొచ్చింది. 2018లో ‘ధడక్’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌లో ఏడేళ్లయినా బాలీవుడ్ హిట్టు మొహం చూడలేదు. తెలుగులో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’తో బ్లాక్‌బస్టర్అందుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

blockbuster debut Bollywood actress Breaking News Devara Movie Janhvi Kapoor latest news NTR peddhi movie ram charan Sana Buchibabu Sridevi daughter Telugu News Tollywood entry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.