📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? అయితే ఇవితినకండి

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 5:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన శరీరంలో కిడ్నీల పాత్ర ప్రధానమైనది. ఇవి శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపిచడానికి తోడ్పడుతాయి. ఇవి సమర్థంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది హార్ట్​, లివర్​ హెల్త్​ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, కిడ్నీల విషయానికి వచ్చే సరికి నిర్లక్షం చేస్తారు. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు సహా ఇతర సమస్యలు వేధిస్తాయి. ఈ క్రమంలోనే కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు(Doctors) చెబుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల జోలికి పోవద్దని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.సోడియం ఎక్కువగా తీసుకోవడం అనేది అధిక రక్తపోటుకు కారణం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. దీర్ఘకాలికంగా ఈ పరిస్థితి మూత్రపిండాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే హైబీపీ సమస్యతో బాధపడేవారిలో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాల్లోని రక్తనాళాలపై ఒత్తిడి కలుగుతుందని, దీనివల్ల రక్తనాళాలు బలహీనమై క్రమంగా కిడ్నీలు పనిచేయవని తెలియజేస్తున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఒబెసిటీ

ఇన్​స్టంట్ నూడుల్స్, చిప్స్, రెడీ టు ఈట్ లాంటి పదార్థాలు సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని తరుచూ తీసుకోవడం వల్ల ఒబెసిటీ బారిన పడడంతో పాటు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుందని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్  పేర్కొంది. వీటికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ముప్పు తగ్గుతుందని నిపుణులు(Experts)వివరిస్తున్నారు.కూల్​డ్రింక్స్​లో షుగర్​, కార్బోనేటేడ్ వాటర్​ అధిక మొత్తంలో ఉంటాయని, ముఖ్యంగా కోలా వంటి ఫాస్పోరిక్ ఆమ్లం అధికంగా ఉండే పానీయాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయనినేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ (National Library of Medicine) పేర్కొంది. ఇందులో ఉండే కాల్షియం జీవక్రియను ప్రభావితం చేయడంతో పాటు మూత్రపిండాలపై అదనపు భారాన్ని కలిగిస్తాయని వివరిస్తున్నారు. వీటికి బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, తాజాగా ఉన్న పండ్ల రసాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తొలగిపోవడంతో పాటు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని వివరిస్తున్నారు.

Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా

క్రియాటిన్​

శరీరానికి ప్రొటీన్ తప్పనిసరి అయినప్పుటికీ రెడ్ మీట్​ను అధికంగా తీసుకోవడం వల్ల క్రియాటిన్​ ఉత్పత్తి పెరుగుతుందని, వీటిని తొలగించడానికి మూత్రపిండాలకు ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. రెడ్ మీట్​కు బదులుగా మూంగ్ దాల్, రాజ్మా, చనా, పనీర్, పెరుగు లాంటివి తీసుకోవడం వల్ల తగినంత ప్రొటీన్​తో పాటు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు. షుగర్ అధికంగా తీసుకుంటే డయాబెటిస్ వస్తుందని చాలా మందికి తెలిసిన విషయమే.అయితే మన రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ నియంత్రణలో లేకపోవడం వల్ల మూత్రపిండాలలోని రక్త నాళాలు దెబ్బతింటాయని (National Kidney Foundation) పేర్కొంది. ఈ పరిస్థితి కారణంగా కిడ్నీలకు రక్తంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్‌ చేసే సామర్థ్యం తగ్గిపోతుందని, ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే కిడ్నీలు పనిచేయకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.

Read Also :Health: క్యాన్సర్ ని ఆమడదూరం ఉంచే పనస

#AvoidTheseFoods #HealthyKidneys #KidneyCare #KidneyHealth #KidneyStones Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.