📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Parents Should Not Force: మీ పిల్లలతో బలవంతంగా చేయిస్తున్నారా?

Author Icon By Vanipushpa
Updated: May 14, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లల(Kids) ను బాగా పెంచి, వారిని ప్రయోజకులను చేయాలని ప్రతి పేరెంట్స్(Parents) కోరుకుంటారు. అయితే పిల్లలను పెంచడం అంటే వారిని నియంత్రించడం(Contro) కాదని, మార్గనిర్దేశం చేయడమని నిపుణులు అంటున్నారు. వారికి క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రు(Parents) లదే కానీ, వాళ్లను ఆ పని ఇలా చేయాలి, అలా చేయకూడదని బలవంతం చేయడం వల్ల పిల్లల్లో కోపం (Kids fear), భయం వంటి వాటికి దారితీస్తాయని చెబుతున్నారు.
బలవంతంగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం వంటివి వద్దు
రిలేటివ్స్​ను హగ్​​ చేసుకోవాలని లేదా వాళ్లకు ముద్దు పెట్టాలని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఫోర్స్​ చేస్తుంటారు. అయితే ఇలా బలవంతంగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం వంటి పనుల వల్ల పిల్లలు అసౌకర్యంగా ఫీల్ అవుతారని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే బంధువులు, సన్నిహితులతో ఎలా మెలగాలో నేర్పాలని, మరీ ముఖ్యంగా రిలేటివ్స్​తో ఎలా ఉండాలనుకుంటున్నారో సెలెక్ట్​ చేసుకునే ఆప్షన్​ పిల్లలకే ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.

Parents Should Not Force: మీ పిల్లలతో బలవంతంగా చేయిస్తున్నారా?

మీ కోరికలు వారిపై రుద్దవద్దు
పిల్లలు చేసే చిన్న చిన్న పనులపై కూడా పేరెంట్స్ శ్రద్ధ వహించాలని అంటున్నారు. ఎందుకంటే వారి ప్రవర్తనను సరిగ్గా గమనించకపోతే తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే క్రమశిక్షణ పేరుతో మీ కోరికలను పిల్లలపై రుద్దడం మంచిది కాదంటున్నారు. తల్లిదండ్రులు బలవంతంగా తమ కోరికలను పిల్లలపై రుద్దడం వల్ల వారి జీవితంలో ఈ విషయం మానని గాయంగా మారుతుందని, ఎప్పుడూ వాళ్లు చెప్పిందే వినాలనే భావనలో తమకు(చిన్నారులకు) నచ్చినట్లుగా ప్రవరిస్తారని అంటున్నారు.
క్షమాపణ చెప్పడం
సాధారణంగా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పమని పేరెంట్స్​ చెబుతుంటారు. అయితే ఇలా సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు చెప్పుతున్నారో వారికి తెలియజేయాలని సూచిస్తున్నారు. వారి ప్రవర్తన వల్ల ఇతరులు ఎలా ఇబ్బందిపడ్డారో వారికి అర్థం అయ్యేలా చెప్పాలని వివరిస్తున్నారు. అలాకాకుండా ఎందుకు క్షమాపణ చెబుతున్నారో సృష్టమైన అవగాహన లేకపోతే పిల్లలు దానిని నెగిటివ్​గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఆహారం విషయంలో
నచ్చినా, నచ్చకపోయినా ఎక్కువ మొత్తంలో అన్నం తినాల్సిందే అని పిల్లలపై చాలా మంది పేరెంట్స్​ ఒత్తిడి తెస్తుంటారు. అయితే ఈ విధానం వారిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పిల్లలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తినమని బలవంతం చేసే బదులు, తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినేలా చూడాలని సూచిస్తున్నారు.
కెరీర్ విషయంలో
పిల్లలు అందరూ ఒకే విధంగా ఉండరు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రతిభ, ఆసక్తులు కలిగి ఉంటారు. విద్య, వృత్తి విషయంలో తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటారు. అయితే కెరియర్​ విషయంలో వాళ్లను బలవంతపెట్టొద్దని నిపుణులు అంటున్నారు. వాళ్లకు నచ్చిన కోర్సులు ఎంచుకునేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు. ఒకవేళ వారు తీసుకున్న నిర్ణయాలలో ఏమైనా తప్పులు ఉన్నట్లు అనిపిస్తే వాటి వల్ల ఎదురయ్యే పరిస్థితులను క్లియర్​గా వివరించాలని అంటున్నారు.

Read Also: Kashish Chowdhary: బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా హిందూ యువతి చరిత్ర

#telugu News Ap News in Telugu Are you forcing Breaking News in Telugu Google News in Telugu it on your children? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.