మొదలైన భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు

Donald Trump : మొదలైన భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు

అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలు దఫాలుగా అమెరికా నుంచి అక్రమ వలసల్ని భారత్ కు పంపేసిన ట్రంప్.. ఇప్పుడు గ్రీన్ కార్డు దారులకు షాకిచ్చారు. అమెరికాలో ఉంటున్న భారతీయ గ్రీన్ కార్డు దారులపై ఇవాళ్టి నుంచి తనిఖీలు మొదలయ్యాయి. దీంతో వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాస గ్యారంటీ ఇవ్వలేమంటూ తాజాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. ముఖ్యంగా గ్రీన్ కార్డు కలిగి ఉన్న భారతీయుల్ని విమానాశ్రయాలలో బట్టలు విప్పి తనిఖీలు, నిర్బంధాలు, విచారణలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి గ్రీన్ కార్డులు ఉన్నప్పటికీ వాటి చట్టబద్ధత సహా పలు అంశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisements
మొదలైన భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు

భారతీయులే టార్గెట్
భారతీయులే టార్గెట్ అమెరికావ్యాప్తంగా విమానాశ్రయాలలో సీనియర్ సిటిజన్లు అయిన భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లను తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా వెలుపల ఎక్కువ కాలం గడిపే వ్యక్తులను, భారతదేశాన్ని తరచుగా సందర్శించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ సిటిజన్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఫారమ్ I-407పై సంతకం చేయమని బలవంతం చేస్తున్నారని ఫ్లోరిడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది అశ్విన్ శర్మ ఆరోపించారు.
ఫామ్ I-407పై సంతకాలకు ఒత్తిడి
ఫామ్ I-407పై సంతకాలకు ఒత్తిడి అమెరికాలో గ్రీన్ కార్డులు కలిగిన భారతీయ సీనియర్ సిటిజన్లను ఇప్పుడు పలు చోట్ల ఫామ్ I-407పై సంతకాలు చేయాలంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సియాటిల్‌కు చెందిన న్యాయవాది కృపా ఉపాధ్యాయ్ ఒత్తిడిలో పడి గ్రీన్ కార్డ్‌లను అప్పగించవద్దని హెచ్చరించారు. ఒక వ్యక్తి ‘స్వచ్ఛందంగా ఫారమ్ I-407పై సంతకం చేయకపోతే సరిహద్దులో వారి గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయలేరని గుర్తుచేశారు. వారు విమానాశ్రయంలో లొంగిపోతే మాత్రం వారు ఆ హక్కును కోల్పోతారన్నారు.
ప్రమాదంలో వీరి గ్రీన్ కార్డులు..!
అమెరికా ఫస్ట్ నినాదంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. ఇందులో భాగంగా గ్రీన్ కార్డుదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ సురక్షితంగా భావించిన గ్రీన్ కార్డ్ హోల్డర్లు ప్రమాదంలో పడ్డారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లు అనేక కారణాల వల్ల తమ హోదాను కోల్పోవచ్చు. ఇందులో అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం ఒకటి. ఆరు నెలలకు పైగా ఇలా బయట ఉంటే వారిని తనిఖీ చేసే అధికారం ఉంది. సంవత్సరం పాటు ఆటోమేటిగ్గా వీరు గ్రీన్ కార్డు హోదా కోల్పోవచ్చు.

స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు

అలాగే జాతీయ భద్రతా సమస్యలు, సంభావ్య ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మోసం, వీసా ఉల్లంఘనలు చేసిన వారూ ప్రమాదంలో పడుతున్నారు. భారతీయుల్లో భయాలు అమెరికాలో అతిపెద్ద గ్రీన్ కార్డ్ హోల్డర్లలో భారతీయులు ఉన్నారు. ఇప్పటికే ఉపాధి ఆధారిత బ్యాక్‌లాగ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ అమెరికాలో గ్రీన్ కార్డు ఉంటే చాలు సురక్షితంగా ఉండొచ్చని భావించిన వీరంతా ఇప్పుడు స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Related Posts
ఎమ్మెల్సీ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దంగానే ఉంది : సీపీఐ నారాయణ
Congress is ready to give MLC.. CPI Narayana

హైదరాబాద్‌: ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీపీఐకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగానే ఉందని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. గురువారం Read more

TTD: రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు
రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల Read more

చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ ముందు.
chandrababu naidu

చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి, తెలుగు ప్రజలతోపాటు అనేక మంది ఈ పార్టీకే ఓటు వేయాలని Read more

తిరుపతి తొక్కిసలాట..ప్రధాని, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
Tirupati stampede..Prime Minister, Revanth Reddy shocked

తిరుమల: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 60 మందికి గాయాలయ్యాయి. వారందర్నీ తిరుపతిలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *