కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య పంటల కనీస మద్దతు ధర (MSP) సహా వివిధ డిమాండ్లపై చర్చించేందుకు మరో కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం రైతుల ప్రతినిధులతో శుక్రవారం భేటీ అవుతోంది.
ఈ సమావేశం చండీగఢ్‌లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో జరుగనుంది.
పంజాబ్ వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియాన్ కూడా సమావేశంలో హాజరు కానున్నారు.ఈ సమావేశంలో 28 మంది రైతులతో కూడిన ప్రతినిధి బృందం పాల్గొంటుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రి జోషి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియాన్ కూడా హాజరవుతారని వారు తెలిపారు.

రైతు నేతల భేటీ & ప్రధాన డిమాండ్లు
ఈ సమావేశంలో 28 మంది రైతు నేతల ప్రతినిధి బృందం పాల్గొంటుంది.
భేటీకి సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) & కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులు హాజరవుతున్నారు.
ప్రధాన డిమాండ్లు:
MSPకు చట్టబద్ధ హామీ
ఇతర రైతు సంక్షేమ నిబంధనలు & విధానాలు, నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నాయకుడు
జగ్జిత్ సింగ్ దల్లేవాల్, ఖనౌరీ నిరసన స్థలంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడు. భేటీకి హాజరయ్యేందుకు అంబులెన్స్‌లో సమావేశ వేదికకు తీసుకెళ్లనున్నారు.
సమావేశానికి హాజరయ్యే ముఖ్య రైతు నేతలు
సర్వన్ సింగ్ పంధేర్, అభిమన్యు కోహర్, కాకా సింగ్ కొట్రా, సుఖ్‌జిత్ సింగ్, పిఆర్ పాండియన్
అరుణ్ సిన్హా, లఖ్‌విందర్ సింగ్, జస్విందర్ లోంగోవాల్, MS రాయ్ నంద్ కుమార్, బల్వంత్ సింగ్ బెహ్రామ్‌కే
ఇందర్‌జిత్ సింగ్ కొత్‌బుధా
గత సమావేశాల ఫలితాలు & తాజా పరిస్థితి
జనవరి 18 – కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కిసాన్ మోర్చా (SKM) & కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు జరిపింది.
ఫిబ్రవరి 14 – కేంద్రం & పంజాబ్ ప్రభుత్వ మంత్రులతో మరో సమావేశం జరిగింది.
ఫిబ్రవరి 2024లో మొత్తం 4 రౌండ్ల భేటీలు జరిగాయి, కానీ సమస్యకు పూర్తి పరిష్కారం రాలేదు.
ఎలాంటి నిర్ణయం వస్తుందో?
ఈ సమావేశం రైతుల MSP డిమాండ్‌పై కేంద్రం ఎలాంటి హామీ ఇస్తుందో చూడాలి. గత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ఈ సమావేశంపై రైతు సంఘాలు & ప్రభుత్వం మధ్య కీలక చర్చలు సాగుతాయి. రైతుల డిమాండ్లపై కేంద్రం తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి!