రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ,ది రాజా సాబ్ షూటింగ్ పూర్తికావొచ్చింది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రం కూడా త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకునే సురేష్ కొండి అనే వ్యక్తిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యూట్యూబ్ జర్నలిస్ట్‌పై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు అయ్యింది.
టైటిల్
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లో ఉన్న ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పనిచేస్తున్న అసోసియేట్ ఎడిటర్ ఇటీవల ప్రభాస్ ఆరోగ్యంపై ఓ వీడియో పోస్ట్ చేశాడు. “డార్లింగ్ ఇన్ డేంజర్” అనే టైటిల్ తో విడుదలైన ఈ వీడియోలో, ప్రభాస్ మేజర్ సర్జరీ చేయించుకున్నాడని పేర్కొన్నాడు. ఈ వార్త వైరల్‌గా మారడంతో, ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.
బెదిరింపులు
ఈ వీడియోపై ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకునే సురేష్ కొండి స్పందించాడు. ఆయన జర్నలిస్టుకు ఫోన్ చేసి, “మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. వెంటనే వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొనబడింది. అయితే, జర్నలిస్ట్ వీడియోను తొలగించడానికి అంగీకరించలేదు.దీంతో, సురేష్ కొండి ఆ వీడియోను ప్రభాస్ అభిమానులకు పంపించాడు. ఆ వీడియోను చూసిన అభిమానులు జర్నలిస్టుకు ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా తీవ్రంగా హెచ్చరించారు. “నిన్ను చంపేస్తాం.. మీ ఆఫీసును తగలబెడతాం” అంటూ బెదిరింపులు పంపించారు.

ఫ్యాన్స్ దాడి
ఈ వివాదం ఇంకా ముదిరి, మార్చి న కొంత మంది యువకులు జర్నలిస్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. తాము ప్రభాస్ అభిమానులమంటూ గొడవకు దిగారు. భయపడ్డ జర్నలిస్ట్ వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పోలీసు కేసు
ఈ ఘటనలో ప్రధాన బాధ్యుడు సురేష్ కొండియేనని, ఆయన కారణంగా తనకు ప్రాణహాని ఉందని బాధిత జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు, సురేష్ కొండిపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన టాలీవుడ్‌లో కలకలం రేపింది. సోషల్ మీడియాలో కూడా ఈ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. జర్నలిస్టులపై బెదిరింపులు తగవని, అభిమానులు మరింత సంయమనంతో వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు ప్రభాస్ అభిమానులపై ఎలా ప్రభావం చూపుతుందనేది చూడాలి.