📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

10th Results: ఏప్రిల్ 22న టెన్త్‌ ఫలితాలు విడుదల

Author Icon By Anusha
Updated: April 16, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తి అయ్యింది.ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న విడుదలకు నిర్ణయం తీసు కొన్నారు. కాగా, పదో తరగతి ఫలితాలను ఏపీలో ఈ నెల 22న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం కీలక అంశం పైన ప్రభుత్వ స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఆ క్లారిటీ వచ్చిన తరువాతనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్ పూర్తయింది. మార్కుల గ్రేడింగ్ ప్రక్రియ కొనసా గుతోంది. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే ఏప్రిల్ 22వ తేదీన టెన్త్‌ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇంటర్ ఫలితాల తరహాలోనే పదో తరగతి ఫలితాల వెల్లడి మార్కులను ప్రత్యేకంగా వాట్సప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ పూర్తయిన తరువాత అధికారికంగా వెల్లడించనున్నారు.

స్పష్టత

తెలంగాణలోనూ పదో తరగతి మూల్యాంకనం పూర్తి చేసారు. మార్కుల జాబితాలను సిద్దం చేస్తు న్నారు. వచ్చే వారం ఈ ఫలితాల విడుదలకు అధికారులు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సారి ఫలితాల వేళ ప్రభుత్వం నుంచి కీలక అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది. పదో తరగతి లో గ్రేడింగ్ విధానం తొలిగించి మార్కులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దాని పైన స్పష్టత ఇవ్వలేదు. దీని పైన స్పష్టత ఇస్తేనే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ పూర్తయినా ఈ అంశం పైన క్లారిటీ వస్తే మార్కుల జాబితాలను సిద్దం చేసి ఫలితాలను వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: KA Paul: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

#AP10thResults #APEducation #APSSCResults #BoardExamResults #Class10Results #SSCResults2025 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.