మీరు స్విగ్గీ లేదా జొమాటో నుండి ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్(Online food order) చేస్తుంటారా..? ముఖ్యంగా మీరు జొమాటో గోల్డ్లే(Zomato) లేదా స్విగ్గీ (Swiggy)వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారా.. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ లాయల్టీ ప్రోగ్రామ్ యూజర్లకు గతంలో ఉన్న ‘రెయిన్ సర్‌ఛార్జ్’ (Rain Charges) మినహాయింపును తొలగించాయి. అంటే ఇప్పటి నుండి వర్షం పడినప్పుడు సాధారణ కస్టమర్లలాగానే మీరు కూడా అదనపు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జొమాటో గోల్డ్ అండ్ స్విగ్గీ వన్ యూజర్లు వర్షాకాలంలో అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ చార్జెస్ కేవలం సబ్‌స్క్రిప్షన్ లేని వారికి మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ఉన్నా లేకున్నా వర్షం పడినప్పుడు డెలివరీపై అదనపు ఛార్జీలు తప్పవు.

పెట్టుబడిదారుల ఒత్తిడిలో జొమాటో, స్విగ్గీ
ఈ నిర్ణయం వెనుక జొమాటో, స్విగ్గీ లాభాలను మెరుగుపరచుకోవాలనే పెట్టుబడిదారుల ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన గణాంకాలు ఈ కంపెనీల ఆర్థిక స్థితిని స్పష్టం చేస్తున్నాయి. జొమాటో (పేరెంట్ కంపెనీ ఎటర్నల్), 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (Q4 FY25)లో పన్ను తర్వాత లాభం (PAT) కేవలం రూ.39 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.175 కోట్ల లాభంతో పోలిస్తే 78% తక్కువ. మరోవైపు, స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. Q4 FY25లో కంపెనీ నికర నష్టం రూ.1,081.18 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలో చూస్తే రూ.554.77 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ నష్టం 94% కంటే ఎక్కువగా పెరిగింది.
ప్లాట్‌ఫామ్ ఫీజు 5 రెట్లు పెంపు
గత కొన్ని నెలలుగా స్విగ్గీ ఇంకా జొమాటో ప్రతి ఆర్డర్ నుండి ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇటీవలే ఈ రెండు కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజును 5 రెట్లు పెంచి రూ.10కి చేర్చాయి. అంతకుముందు ఈ ఫీజు ఆర్డర్‌కు కేవలం రూ.2 మాత్రమే ఉండేది. ఈ మొత్తం తక్కువగా అనిపించినా, ఈ రెండు కంపెనీలు రోజుకు 20 లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్‌లను డెలివరీ చేస్తాయి. కాబట్టి, ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేస్తే ప్రతి కంపెనీకి రోజుకు కనీసం రూ.2 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. మొత్తానికి కస్టమర్లకు కొంత భారం పడినప్పటికీ ఈ నిర్ణయాలు కంపెనీల ఆర్థిక స్థిరత్వానికి, లాభాల పెంపుకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Bomb Blast : పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. నలుగురు మృతి