Tata Motors: మార్కెట్లోకి టాటా హారియర్, సఫారీ ‘స్టెల్త్ ఎడిషన్’.. అదిరిపోయే లుక్, లగ్జరీ ఫీచర్లు!

Follow Us: Google News Daily Hunt
Tata Motors launches the 2026 Harrier and Safari 'Stealth Edition'. Featuring a matte black design, Carbon Noir interiors, and impressive features—here are the full pricing details.
Tata Motors launches the 2026 Harrier and Safari 'Stealth Edition'. Featuring a matte black design, Carbon Noir interiors, and impressive features—here are the full pricing details.
FONT SIZE
GET APP

Tata Motors: ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ‘2026 హారియర్ స్టెల్త్ ఎడిషన్’ (Harrier Stealth Edition), ‘సఫారీ స్టెల్త్ ఎడిషన్’ (Safari Stealth Edition) లను అధికారికంగా విడుదల చేసింది. ఎస్‌యూవీ (SUV) లైనప్‌లో మరింత పవర్‌ఫుల్ మరియు ప్రీమియం లుక్‌ను కోరుకునే కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక ఎడిషన్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు మోడళ్లు ఆయా కార్ల టాప్-ఎండ్ ట్రిమ్‌లైన ఫియర్‌లెస్ అల్ట్రా (Fearless Ultra), అకంప్లిష్డ్ అల్ట్రా (Accomplished Ultra) ఆధారంగా రూపుదిద్దుకున్నాయి.

Read Also :Sony RX10 V Review: తొమ్మిదేళ్ల తర్వాత సోనీ కొత్త ‘బ్రిడ్జ్ కెమెరా’.. డిజైన్ అదుర్స్

Tata Motors

స్టెల్త్ బ్లాక్ కాస్మెటిక్ అప్‌డేట్స్

సాధారణ మోడళ్లతో పోలిస్తే ఈ స్టెల్త్ ఎడిషన్లు రోడ్డుపై ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చేలా పలు బాహ్య, అంతర్గత మార్పులతో వచ్చాయి:

  • ఎక్స్‌టీరియర్ పెయింట్: ఈ కార్లు ప్రత్యేకమైన ‘స్టెల్త్ బ్లాక్’ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌తో వస్తాయి.
  • అల్లాయ్ వీల్స్: 19-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్‌కు క్లాసీగా ఉండే ‘మ్యాట్ స్టెల్త్ బ్లాక్’ ఫినిషింగ్‌ను ఇచ్చారు.
  • ప్రత్యేక బ్యాడ్జింగ్: కారు ఫ్రంట్ ఫెండర్లపై ప్రత్యేకమైన ‘స్టెల్త్’ (Stealth) బ్యాడ్జ్‌లను అమర్చారు.
  • ఇంటీరియర్ థీమ్: కారు లోపలి భాగంలోనూ ఆల్-బ్యాక్ థీమ్‌తో పాటు ప్రీమియం ‘కార్బన్ నోయిర్’ (Carbon Noir) లెథరెట్ సీట్లను అందించారు.

ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్)

టాటా మోటార్స్ ఈ సరికొత్త ఎడిషన్ల ధరలను వేరియంట్లను బట్టి కింది విధంగా నిర్ణయించింది.రూ. 23.43 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 26.01 లక్షల వరకు ఉంది. దీని ప్రారంభ ధర రూ. 24.09 లక్షలు కాగా, టాప్ ఎండ్ ధర రూ. 26.76 లక్షలుగా ఉంది.

Tata Motors: ఇంజన్ ఆప్షన్లు & ఫీచర్లు

గతంలో పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉన్న ఈ థీమ్‌ను, ఈసారి పెట్రోల్ మరియు డీజిల్.. రెండు ఇంజన్ ఆప్షన్లలోనూ టాటా తీసుకొచ్చింది. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ (170hp), 2.0-లీటర్ టర్బో డీజిల్ (170hp) ఇంజన్లు ఉన్నాయి. ఫీచర్ల పరంగా 14.9-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డాల్బీ అట్మోస్‌తో కూడిన 13-స్పీకర్ల జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరాతో పాటు అడ్వాన్స్‌డ్ సేఫ్టీ కోసం లెవెల్ 2 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీని ఇందులో అందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు