Stock Markets: నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు

Read Time:  1 min
నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు
FONT SIZE
GET APP

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈరోజు తీవ్ర ఒడుదొడుకుల మధ్య కదలాడి చివరికు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు సూచీలు భారీ నష్టాలను నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. అయినప్పటికీ, మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల నుంచి పూర్తిగా బయటపడలేకపోయాయి.

Stock Markets: నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు
Stock Markets: నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూశాయి

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్(Sensex) 77 పాయింట్లు క్షీణించి 81,373 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 24,716 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎటర్నల్, టాటా కన్జ్యూమర్‌, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాలను ఆర్జించాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. రంగాల వారీగా చూస్తే, పీఎస్‌యూ బ్యాంకింగ్, రియాల్టీ రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఐటీ, మెటల్‌ రంగాల సూచీలు మాత్రం సుమారు 0.5 శాతం మేర నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.38 వద్ద కొనసాగుతోంది.

Read Also: IPhone: బెంగళూరులో ఆపిల్ కొత్త స్టోర్

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.