Kavitha: జగన్, చంద్రబాబులపై బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు

Read Time:  1 min
జగన్, చంద్రబాబులపై బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు
జగన్, చంద్రబాబులపై బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఏపీలో రాజకీయాలు వేడి పెంచుతున్న వేళ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పైన బీఆర్ఎస్ ముఖ్య నేత ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జగన్, చంద్రబాబులపై బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు

వైరల్ అవుతున్న కామెంట్స్
కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కవిత ఏపీ నేతల పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్య నేతల గురించి వరుసగా అభిప్రాయాలు చెప్పిన కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పవన్ దురదృష్టవశాత్తూ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. చెగువేరా గురించి చెప్పే పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా బీజేపీకి రైటిస్ట్ గా మారారని చెప్పుకొచ్చారు. పవన్ చేసే స్టేట్మెంట్స్ లో ఆయనకే స్పష్టత ఉండదని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయని వ్యాఖ్యానించారు.
జగన్ నచ్చుతాడు, చంద్రబాబు హుందా రాజకీయాలు చేస్తారు
జగన్ అలా – చంద్రబాబు ఇలా ఏపీ మాజీ సీఎం జగన్ పైన కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. జగన్ ను తాను అభిమానిస్తానని చెప్పారు. రాజకీయ జీవితంలో కఠిన పరీక్షలు సమర్ధవంతంగా ఎదుర్కున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నారు. జగన్ సమస్యల పైన ప్రస్తావన చేసే విధానం తనకు నచ్చుతుందని చెప్పారు. ఇదే సమయంలో కవిత ఏపీ సీఎం చంద్రబాబు గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. సోనియా తరహాలో చంద్రబాబు హుందా రాజకీయాలు చేస్తారని పేర్నొన్నారు.

READ ALSO: KCR: జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.