భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

Kaman Bridge: భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న కమాన్ వంతెనను 6 ఏళ్ల తర్వాత తొలిసారి తెరవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం మూసివేసిన ఈ కమాన్ వంతెనను.. తాజాగా శనివారం అధికారులు తెరిచారు. భారత్-పాక్ సరిహద్దుల్లో.. రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన తెరవడం ఇప్పుడు గమనార్హం. జీలం నదిలో దూకి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. వారి మృతదేహాలను తిరిగి బయటికి తీసుకువచ్చేందుకు ఈ కమాన్ వంతెనను తాజాగా తెరిచారు. ఇక ఈ కమాన్ వంతెనను తెరవడం రాజకీయంగానే కాకుండా మానవతా చర్యగా అధికారులు పేర్కొంటున్నారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
ఈనెల 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన ఓ యువకుడు, యువతి జీలం నదిలో మునిగిపోయినట్లు భారత సైన్యం తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు జీలం నదిలో నీటి ప్రవాహం ధాటికి భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. అయితే జీలం నదిలో మునిగిపోయిన ఆ యువతీ, యువకుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే మొదటగా యువకుడి మృతదేహం భారత భూభాగం వైపు కనిపించింది.
యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం
అయితే ఆ యువకుడి మృతదేహాన్ని వెలికితీసే లోపే నీటి ప్రవాహంలో నియంత్రణ రేఖను దాటి అది అవతలి వైపునకు కొట్టుకుపోయింది. చివరికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-పీఓకేలోని చినారి సమీపంలో పాక్ భూభాగం వైపు కనిపించింది. అనంతరం ఆ ప్రాంతం నుంచి యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు ఒకరికొకరు సహకరించుకోవడం గమనార్హం.

Related Posts
4 సంవత్సరాల క్రూయిజ్: ట్రంప్ పదవీ కాలం లేకుండా ప్రపంచాన్ని అన్వేషించాలనుకునే అమెరికన్ల కోసం
Donald Trump cruise

అమెరికాలో పర్యాటకులకు కొత్తగా ఒక ఆసక్తికరమైన అవకాశం వచ్చింది. ట్రంప్ రెండో టర్మ్ ని వదిలిపెట్టి విదేశీ గమ్యస్థానాలు చూడాలనుకుంటున్న వారికి 4 సంవత్సరాల క్రూయిజ్ ట్రిప్ Read more

ఆర్‌జి కర్ కాలేజ్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు నమోదు
rg kar

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఆర్‌జికెఎంసిహెచ్)లో అక్రమాస్తుల కేసులో ఐదుగురు నిందితులపై అభియోగాలను రూపొందించే ప్రక్రియను బుధవారం ప్రారంభించాలని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. Read more

కొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
Counting of votes for the ongoing Delhi elections

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం Read more

సచిన్ రికార్డుపై హిట్ మ్యాన్ కన్ను – రోహిత్ శర్మ
సచిన్ రికార్డుపై హిట్ మ్యాన్ కన్ను - రోహిత్ శర్మ

సచిన్ రికార్డుపై హిట్ మ్యాన్ కన్ను - రోహిత్ శర్మ కొత్త మైలురాయి భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి క్రికెట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *