మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన: వివాహ వేడుకకు వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం, ఇనుప రాడ్‌తో దారుణం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో హృదయాన్ని కలిచివేసే, నిర్భయ ఘటనను తలపించే ఘోర అప్రాధ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై కామాంధులైన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లో (private parts) కి ఇనుప రాడ్ చొప్పించి నరకయాతనకు గురిచేశారు. ఈ దారుణానికి గురైన మహిళ గర్భాశయం బయటకు వచ్చి, తీవ్రమైన రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వివాహ వేడుకకు వెళ్లిన మహిళ, ఆపై కనిపించకుండా పోయిన దారుణ ఘటన
ఈ హింసాత్మక ఘటన శుక్రవారం (మే 23) రాత్రి ఖాండ్వా జిల్లాలో (Khandwa district) ని ఓ చిన్న గ్రామంలో జరిగింది. గ్రామంలో జరిగిన ఒక వివాహ వేడుకకు బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరైంది. శుభకార్యం ముగిశాక రాత్రి సమయంలో ఆమె కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుకభాగంలో మహిళ రక్తస్రావం, హ్యాల్ఫ్ న్యూడ్‌గా ఉన్న స్థితిలో పడి ఉన్నదాన్ని గ్రామస్తులు గమనించారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే, ఆమెకు జరిగిన అమానుషాన్ని వివరించేలోపే తీవ్ర రక్తస్రావం (With heavy bleeding) తో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది.
వైద్యులు తెలిపిన అమానవీయ వివరాలు
బాధితురాలి శరీరాన్ని ఖల్వా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. వైద్యుల చెబుతుండగా, ఆమె శరీరంపై ఎన్నో చోట్ల దారుణమైన గాయాల చిహ్నాలు ఉన్నాయి. ప్రైవేట్ పార్ట్ నుంచి తీవ్రమైన రక్తస్రావం జరగడం, గర్భాశయం బయటకు రావడం వంటి భయంకర పరిస్థితులు వైద్యులను కూడా షాక్‌కు గురిచేశాయి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ఒక ఇనుప రాడ్ ఆమె ప్రైవేట్ భాగాల్లోకి చొప్పించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తేలింది. మహిళ తాళలేని నొప్పితో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిందితులు అరెస్ట్ – పోలీసులు కేసు దర్యాప్తు
మహిళ మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోష్ని చౌకి ఇన్ ఛార్జ్ ఎస్ఐ సుసా పార్టే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ బాధితురాలి గ్రామానికి చెందినవారేనని పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు. మహిళ మృతదేహాన్ని శనివారం రాత్రి పోస్టుమార్టం పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెపై దారుణంగా అత్యాచారం జరిగిందని పోస్ట్ మార్టం పరీక్షల్లో వెల్లడైంది. “మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఈ కేసులో సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం” అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ రఘువంశీ తెలిపారు.
Read also: Madhya Pradesh :పెళ్లికి వెళ్లిన మహిళపై కామాంధుల ఘాతుకం