ఇరాన్ బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’ – ప్రకృతి అద్భుతం!

ఇరాన్ బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’ – ప్రకృతి అద్భుతం!

ఇరాన్‌లోని రెయిన్ బో ఐలాండ్‌లో ఇటీవలే అద్భుతమైన ప్రకృతి సంఘటన చోటుచేసుకుంది. అక్కడ కురిసిన వర్షం రక్తం వలే ఎర్రని రంగులోకి మారడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇరాన్‌లోని రెయిన్ బో ఐలాండ్‌లో వర్షపు నీరు కొండలపై పడగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. ఈ ప్రవాహం రక్తపు నీరులా కనిపిస్తూ సముద్రంలో కలుస్తోంది. బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారిపోవడం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ దృశ్యం ప్రకృతిలో ఒక వింతగా, విజువల్ స్పెషల్ఎఫెక్ట్‌లా కనిపిస్తోంది.

ఇరాన్ బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’ – ప్రకృతి అద్భుతం!

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు
ప్రతి సంవత్సరం వేలాదిమంది ఈ “బ్లడ్ రెయిన్” దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఇరాన్‌కు వస్తారు.
ఇటీవల కొంతమంది టూరిస్టులు ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ, వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొంతమంది ఎర్రని ప్రవాహంలో గంతులు వేస్తూ ఆడుకున్నారు. కొండలపై పడిన వర్షం జలపాతంలా కిందికి దూకుతుండటంతో, సందర్శకులు ఆనందంగా కేరింతలు కొట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఓ నెటిజన్ ఈ అరుదైన ప్రకృతి దృశ్యాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. “ఇది ప్రకృతిలోని వింతలకు ఓ అద్భుతమైన ఉదాహరణ” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుంది!” అంటూ పర్యాటకులు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు.
ఎర్రని వర్షానికి కారణం ఏమిటి?

రెయిన్ బో ఐలాండ్ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉన్న ప్రదేశం. అక్కడ లావా చల్లారిన తర్వాత ఈ దీవి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాన్ని పొందింది. ఈ ప్రాంత మట్టిలో ఐరన్ ఆక్సైడ్ (Iron Oxide) ఎక్కువ మోతాదులో ఉంది. వర్షపు నీరు ఆ మట్టిని తాకినప్పుడు రసాయనిక మార్పులతో ఎర్ర రంగులోకి మారుతుంది.ఈ ఎరుపు నీరు సముద్రంలో కలిసిపోవడంతో, బీచ్ మొత్తం ఎర్రగా మారిపోతోంది.
దీని వల్ల రక్తం వలే ప్రవహించే ఎర్రని నీటి ప్రవాహం కనబడుతుంది.

    Related Posts
    తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది: కేటీఆర్‌..!
    ktr comments on cm revanth reddy

    హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి Read more

    చైనా అంతరిక్ష శక్తిలో రాణిస్తున్నది – అమెరికా అధికారి నెగిటివ్ హెచ్చరిక
    China 2

    అమెరికా సైన్యం ఉన్నతాధికారి ఒక కీలకమైన హెచ్చరికను జారీ చేశారు. చైనా అంతరిక్ష రంగంలో మరియు సైనిక శక్తి పెంపకం లో ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రగతిని Read more

    జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. నోటిఫికేషన్ విడుదల
    presidents rule has been revoked in jammu and kashmir by ministry of home affairs

    శ్రీనగర్‌: ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు Read more

    ద్వీప దేశానికి తగ్గిన భారత పర్యాటకులు.
    maldives

    మాల్దీవ్స్‌కు గతంలో చాలా మంది భారత పర్యాటకులు అక్కడకు వెళ్తూ ఎంజాయ్ చేసే వాళ్లు. కానీ క్రమేణా ఈ సంఖ్య తగ్గుతూ వస్తుండగా.. ఆ విషయాన్ని గుర్తించిన Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *