Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో ప్రభుత్వ అభివృద్ధి చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలు ప్రస్తావించడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, వరంగల్ ప్రాంతం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ వంటి వీరనారీమణులు పాలించిన భూమి ఇదని కొనియాడారు తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం పుట్టినిల్లు అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Advertisements
Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి
Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి

మామునూరు ఎయిర్‌పోర్టు – హామీని నిలబెట్టిన కాంగ్రెస్

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు దాన్ని నిలబెడుతున్నామన్నారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామన్నారు.బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను ధనిక రాష్ట్రం నుంచి దివాలా తీయించారని కేసీఆర్‌పై మండిపడ్డారు .ఉచిత కరెంటు పేరిట డిస్కంలకు భారీగా బకాయిలు పెంచారని ఆరోపించారు .తెలంగాణ ప్రజలకు వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు

కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ హామీలు – అమలవుతున్న పథకాలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని గుర్తుచేశారు .రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వివరించారు .ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు .తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం ఉద్యోగ నియామకాలు అని రేవంత్ అన్నారు.గత ఏడాది మాత్రమే 55,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ప్రకటించారు , రాష్ట్ర ఆదాయం పూర్తిగా అప్పుల్లో ఉన్నా, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడాన్ని ఆపలేదని స్పష్టం చేశారు

కడియం శ్రీహరి – నిజమైన ప్రజానాయకుడు

రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని నిజమైన ప్రజానాయకుడిగా ప్రశంసించారు.తన కోసం ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజల కోసమే కృషి చేస్తారంటూ” కొనియాడారు కడియం కావ్యను ఎంపీగా గెలిపిస్తే, పార్లమెంటులో కొట్లాడి వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఖాజీపేటకు రైల్వే డివిజన్ తీసుకువస్తారని” హామీ ఇచ్చారు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎద్దేవా –కాళేశ్వరం కాదు, కూలేశ్వరం

లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లు కూడా నిలబడలేదని” ఎద్దేవా చేశారు
ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం” అని వ్యాఖ్యానించారు

బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలన మధ్య తేడా – కేసీఆర్‌కు రేవంత్ సవాల్”

కాంగ్రెస్ హయాంలో ఏన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి? బీఆర్ఎస్ హయాంలో ఏవి పూర్తయ్యాయి?”
ఈ అంశంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా?” అని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు

సంక్షిప్తంగా

రేవంత్ రెడ్డి జనగామ బహిరంగ సభలో ప్రజలకు హామీలు
కాంగ్రెస్ పాలనలో మామునూరు ఎయిర్‌పోర్టు, భారీ అభివృద్ధి పనులు
కేసీఆర్ పాలనలో అప్పులు పెరిగాయని ఆరోపణలు
ఉద్యోగ నియామకాలు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
కడియం కావ్యను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి హామీలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు – కూలేశ్వరం అంటూ ఎద్దేవా

Related Posts
నవంబర్ 09 న విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగం
నవంబర్ 09 న విజయవాడ-శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ప్రయోగం

విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ‘సీ ప్లేన్’ సర్వీసును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న శ్రీకారం చుట్టబోతున్నారు. డీ హవిల్లాండ్ కంపెనీ Read more

దళితుడి ఇంట్లో రాహుల్ భోజనం
rahul gandhi heartfelt cook

దళితుడి ఇంట్లో రాహుల్ వంట చేయడమే కాదు వారితో పాటు కూర్చొని భోజనం చేసి వార్తల్లో నిలిచారు.మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జాతీయ పార్టీల అగ్రనేతల Read more

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
Distribution of pensions in

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి Read more

తిరుపతి లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్..భారీగా ఉపాధి అవకాశాలు
తిరుపతి లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్..భారీగా ఉపాధి అవకాశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధిని సాధిస్తోంది.తిరుపతిలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు Read more

×