ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం : ఆదిత్య ఠాక్రే

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం : ఆదిత్య ఠాక్రే

దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్‌, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్‌, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. ఢిల్లీలో పర్యటించిన ఆదిత్య ఠాక్రే, ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిసినట్లు తెలిపారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అవుతున్నట్లు చెప్పారు.
ఓటర్ల, ఈవీఎం మోసాలు
కాగా, దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని ఆదిత్య ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ దేశంలో ఓటర్ల మోసం, ఈవీఎం మోసాల మధ్య మన ఓటు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నేడు మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయా? మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని భావిస్తున్నాం, కానీ అది ఇకపై ప్రజాస్వామ్యం కాదు.

Advertisements

మాకు (శివసేన), కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో, భవిష్యత్తులో నితీశ్‌, ఆర్జేడీ, చంద్రబాబుకు జరుగవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల’ అని అన్నారు.

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం : ఆదిత్య ఠాక్రే


రోడ్ మ్యాప్‌ సిద్ధం
ఇండియా బ్లాక్ భవిష్యత్తుపై ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఇండియా బ్లాక్‌లో చాలా మంది సీనియర్‌ నాయకులు ఉన్నారని తెలిపారు. దాని కోసం వారు రోడ్ మ్యాప్‌ సిద్ధం చేస్తారని చెప్పారు. ‘ఇండియా బ్లాక్‌కు ఉమ్మడి నాయకత్వం ఉంది.

Related Posts
ఒడిస్సా స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లో మార్పు
ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక నిర్ణయం - విద్యార్థుల యూనిఫాంలకు కొత్త రంగులు

ఒడిశాలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం Read more

ఎన్నికల వేళ భారీ డిస్కౌంట్స్
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది.

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన Read more

ఐఐటీ రిసెర్చ్‌ స్కాలర్‌పై ఏసీపీ అఘాయిత్యం: విధుల్లో నుంచి తొలగింపు
ఐఐటీ రిసెర్చ్‌ స్కాలర్‌పై ఏసీపీ అఘాయిత్యం: విధుల్లో నుంచి తొలగింపు

పెళ్లి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మొదట వెంటబడటం తర్వాత మోసం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఓ రీసెర్చ్ చేస్తున్న అమ్మాయిని పోలీస్ అధికారి పెండ్లి Read more

ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు
ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు

రంగుల పండుగ అయిన హోలీని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండగ అంటే చాలు ప్రతి ఒక్కరి మనసులో ఆనందం ఉత్సాహం కలుగుతుంది. హోలీ రోజున Read more

×