తక్కువ ప్యాకేజీతో బ్యాంకాక్​‌ హ్యాపీ టూర్

Hong Kong: తక్కువ ప్యాకేజీతో బ్యాంకాక్​‌ హ్యాపీ టూర్

24వ తేదీ ఏప్రిల్ 2025 మొదలయ్యే ఈ టూర్‌ ప్యాకేజీ మొత్తం మూడు రాత్రులు, 4 పగళ్లు కొనసాగుతుంది. మొదటి రోజు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలు అవుతుంది. ఇక్కడ విమానం ఎక్కడం ద్వారా టూర్​ మొదలవుతుంది. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రాలైన కోరల్‌ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్‌లో పలు సందర్శనీయ స్థలాల్లో పర్యటించవచ్చు. ఫస్ట్ డే అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్​లోని శంషాబాద్ రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంఛి బ్యాంకాక్​కు ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఉదయం 6 గంటలకు బ్యాంకాక్​ విమానాశ్రయానికి చేరుకుంటారు.

Advertisements
తక్కువ ప్యాకేజీతో బ్యాంకాక్​‌ హ్యాపీ టూర్

మొదట జెమ్స్​ గ్యాలరీ చూసి..
అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి పట్టయకు వెళ్లి హోటల్​లో చెకిన్​ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెషప్​ అయ్యి అల్పాహారం తినాలి. హోటల్​లోనే మధ్యాహ్నం వరకు రెస్ట్​ తీసుకుని మధ్యాహ్నం లంచ్​ చేసి పట్టయలో పర్యాటక ప్రాంతాలను సందర్శిచడానికి వెళ్తారు. మొదట జెమ్స్​ గ్యాలరీ చూసి.. సాయంత్రం అల్కజార్‌ షోను చూడడానికి వెళ్ళాల్సి ఉంటుంది. రాత్రి ఇండియన్​ రెస్టరెంట్​లో డిన్నర్​ చేస్తారు. ఈ రోజు రాత్రి పట్టయలో హోటల్లోనే బస చేస్తారు. సెకండ్ డే: పట్టాయ లో టిఫిన్ తిని కోరల్​ ద్వీపానికి పయణం అవుతారు. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు.. స్పీడ్‌ బోటింగ్‌ కూడా ఉంటుంది. ఇక్కడ ఇండియన్​ రెస్టారెంట్​లో భోజనం చేసి తర్వాత నూంగ్​ నుచ్​ ట్రోపికల్​ గార్డెన్​ కు వెళ్తారు. రాత్రి పట్టయకు తిరిగి చేరుకుంటారు. ఇక్కడే డిన్నర్ చేసి రాత్రి స్టే చేయాల్సి ఉంటుంది.

సఫారీ వరల్డ్ టూర్‌ అండ్​ మెరైన్​ పార్క్
థర్డ్ డే ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేసి హోటల్​ చెక్​ అవుట్​ అయిన తర్వాత సఫారీ వరల్డ్ టూర్‌ అండ్​ మెరైన్​ పార్క్​ కు వెళ్తారు. సాయంత్రానికి ఆ దేశ రాజధాని బ్యాంకాక్​ కు చేరుకోవాలి. అక్కడ ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. షాపింగ్ కూడా చేయవచ్చు. రాత్రి ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది.
ఫోర్త్ డే ఉదయం టిఫిన్ తిని బ్యాంకాక్ సిటీలో చక్కర్లు కొట్టవచ్చు. గోల్డెన్‌ బుద్ధ, మార్బుల్ బుద్ధ ను సందర్శించి.. సాయంత్రం వరకూ షాపింగ్ కూడా చేయవచ్చు. సాయత్రం ఆరు గంటలకు బ్యాంకాక్​ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అక్కడ నుంచి హైదరాబాద్​కు తిరిగి ప్రయాణం అవుతారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు: సింగిల్ షేరింగ్- రూ.54,600
డబుల్ షేరింగ్- రూ.47,580
ట్రిపుల్ షేరింగ్- రూ.47,580
పిల్లలకు విత్​ బెడ్​ – రూ.45,390
విత్​ అవుట్​ బెడ్​ – రూ.40,100

Related Posts
భారతీయ వలసదారుల పట్ల భారత్ ఏమి చేయబోతుంది?
indian immigrants in us.

అమెరికా లో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం C-17 మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి Read more

Israel-Hamas : ఇజ్రాయెల్‌ భీకర దాడి.. గాజాలో 32 మంది మృతి!
Fierce Israeli attack.. 32 people killed in Gaza!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ వరుసదాడులతో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌పై టెల్‌అవీవ్‌ Read more

Sriramanavami : నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి రాక
cm bcm

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు భద్రాచలం పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 10 Read more

హైదరాబాద్లో ఏపీ గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన
group 2 candidate

ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద పెద్ద ఎత్తున సమావేశమైన అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తూ హైదరాబాద్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×