AP 10th results on April 22?

Tenth Results : ఏప్రిల్ 22న ఏపీ టెన్త్ ఫలితాలు?

Tenth Results : ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలన్న దానిపై ఎస్సెస్సీ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఆప్షన్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Advertisements
 ఏప్రిల్ 22న ఏపీ టెన్త్

ట్సాప్ ద్వారా కూడా ఫలితాలు

ఈసారి రాష్ర్లంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుండి 30 వరకు నిర్వహించారు. ఇందులో 6.5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షా ఫలితాలను bse.ap.gov.in వెబ్‌సైట్‌ లో ప్రభుత్వం అందుబాటులో ఉంచబోతోంది. వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యాక విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి విద్యార్ధులు అప్పటివరకూ వేచి చూడక తప్పదు.

Read Also: పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత

Related Posts
మౌనీ అమావాస్య.. 10 కోట్ల మంది వస్తారని అంచనా..!
Mauni Amavasya 2025

ఈ నెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 10 కోట్ల మంది భక్తులు అమృతస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం యూపీ ప్రభుత్వం 12 Read more

లడాఖ్ పరిమిత సరిహద్దు వివాదం: రాజ్‌నాథ్ సింగ్-చైనా రక్షణ మంత్రితో భేటీ
india china

భారతదేశం మరియు చైనాకు మధ్య ఉన్న లడాఖ్ పరిమిత సరిహద్దు వివాదం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సరిహద్దు వివాదం ప్రధానంగా ఐదు ప్రాంతాలలో చోటు Read more

ఆనాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు : లోకేష్
Then Vision 2020 was mocked.. Lokesh

జ్యూరిచ్: ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామిక వేత్తలతో Read more

Madhya Pradesh : ప్రియుడి కోసం భర్త హత్య
Madhya Pradesh : ప్రియుడి కోసం భర్త హత్య

భార్య భర్తను హత్య చేసి ప్రియుడికి వీడియో కాల్ – మధ్యప్రదేశ్‌లో సంచలనం Madhya Pradesh : ప్రేమ పేరుతో భర్తను హత్య చేసిన ఘోర సంఘటన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×