📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Author Icon By Anusha
Updated: April 15, 2025 • 6:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.దీంతో పాటు రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలకు నిధులు, ఐటీ అభివృద్ధికి భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, అనిత మీడియాకు వివరాలు తెలిపారు.

ప్రెస్‌మీట్‌

ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు సమర్ధవంతంగా ఎదుర్కొలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొడుతోందన్న ముఖ్యమంత్రి.. వాటిని మంత్రులు ఎందుకు తిప్పకొట్టడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పడు వివరించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రభావం మంత్రులపై వెంటనే పనిచేసినట్టు కనిపిస్తోంది. మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసిన నలుగురు మంత్రులు కేబినెట్‌ నిర్ణయాలతో వైసీపీ చేసిన పలు ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు.టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేత భూమనపై కేసు పెడతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అబద్ధాన్ని నిజం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో మతకలహాలకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.

క్లస్టర్స్

రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా విశాఖపట్నంలో ఐటీ హిల్-3 వద్ద ప్రముఖ సంస్థ టీసీఎస్‌కు 21.66 ఎకరాలు, క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కాపులుప్పాడలోక్లస్టర్స్‌కు మరో 56 ఎకరాలు కేటాయించారు.సంక్షేమ పథకాల అమలుపైనా కేబినెట్ దృష్టి సారించింది. ఈ నెల 26న మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు.వీటితో పాటు, బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్లపై 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి, పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 

Read Also: IMD: ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం : ఐఎండీ

#AndhraPradesh #APCabinet #ChandrababuNaidu #ReservationReform #SCReservation Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.