Rainfall is higher than normal this time.. IMD

IMD: ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం : ఐఎండీ

IMD : ఈ సారి భారత్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం రంగం వాటా 18 శాతం ఉన్నందున.. ఇది రైతులకు శుభవార్త అని నిపుణులు అంటున్నారు.

Advertisements
 ఈ సారి సాధారణం కంటే

ఈసారి 105 శాతం అధిక వర్షపాతం

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుంది అని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ్ మెహపాత్ర వెల్లడించారు. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ కూడా ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.

దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం

రాబోయే ‘నైరుతి’ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని పేర్కొంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Read Also : ఢిల్లీలోని వాయు కాలుష్యంపై నితిన్‌ గడ్కరీ ఆందోళన

Related Posts
లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసిన వనౌటు ప్రధానమంత్రి
లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసిన వనౌటు ప్రధానమంత్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో పరారీలో ఉన్నారు. తన హయాంలో ఆయనపై కోట్ల రూపాయల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. Read more

Earthquake hits Myanmar : మయన్మార్లో మరోసారి భూకంపం
Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్లో భూకంపం మరొకసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మండాలయ్ ప్రాంతానికి 13 మైళ్ల దూరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో భయంతో Read more

Revanth Reddy: అభివృద్ధి పథంలో అడ్డంకులు సహజమే: రేవంత్ రెడ్డి
Revanth Reddy: అభివృద్ధి పథంలో అడ్డంకులు సహజమే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు Read more

రైతులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు
mla kolikipudi srinivasa ra 1

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు. ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×