📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: తిరుమలలో భక్తుల కోసం ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’ విధానం

Author Icon By Anusha
Updated: April 29, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి భక్తులు నిత్యం వేలాదిమంది తరలివస్తుంటారు. అయితే భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో ప్రధానంగా పాదరక్షలు (చెప్పుల) విషయంలో ఇబ్బందిపడుతున్నారు. కొందరు భక్తులు పాదరక్షలు లేకుండా నడవలేని పరిస్థితి లో ఉంటున్నారు.దీనికి తోడు ఇప్పుడు వేసవి కాలం కావడంతో చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీని కోసం టీటీడీ భక్తులు కాళ్లు కాలకుండా కూల్ పెయింట్‌తో పాటుగా చలువ పందిళ్లు వంటివి ఏర్పాటు చేస్తోంది. అయినా సరే కొందరు భక్తులు పాదరక్షల విషయంలో ఇబ్బందిపడుతున్నారు.ఇటీవల ఇద్దరు భక్తులు చెప్పులతో క్యూలైన్‌లోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ పరిణామాలతో తిరుమలకు వచ్చే భక్తుల పాదరక్షలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ సమస్యకు చెక్ పెట్టింది.

ఏటీసీ

భక్తులు పాదరక్షలు భద్రపరుచుకొనే విషయంలో కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి. టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ‘తిరుమలలోని లగేజీ సెంటర్లలో అమలు చేస్తున్న ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) విధానాన్ని ఇక్కడా అనుసరించాలి’ అని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి నిర్ణయించారు. ఈ సరికొత్త విధానాన్ని తిరుమలలో ఉన్న ఏటీసీ సమీపంలోని పాదరక్షల కేంద్రంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకొచ్చింది టీటీడీ. ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) విధానంలో భక్తుడి ఫొటో, మొబైల్‌ నంబరు తీసుకుని రసీదు ఇస్తారు.

సరికొత్త

భక్తులకు సంబంధించిన పాదరక్షలను ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ ఉన్న బ్యాగ్‌లో వేసి భద్రపరుస్తున్నారు. ఈ మేరకు భక్తుడు దర్శనం అయ్యాక వచ్చి రసీదు చూపిస్తే స్కాన్‌ చేసి ఏ వరుసలో ఏ ర్యాక్‌లో చెప్పులు ఉన్నాయో సులువుగా గుర్తించి అందజేస్తున్నారు. ఈ సరికొత్త విధానంపై భక్తుల అభిప్రాయం సేకరించగా 98 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మిగిలిన నాలుగు కేంద్రాల్లో అమల్లోకి తెస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ సరికొత్త విధానంతో తిరుమలకు వచ్చే భక్తులు పాదరక్షలకు సంబంధించిన సమస్యకు ఇక చెక్ పడినట్లే అంటున్నారు.ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించడానికి, అలిపిరి, శ్రీవారి మెట్టులో లగేజ్ నిర్వహణ వ్యవస్థ విజయంతో ప్రేరణ పొందిన టిటిడి ఆర్‌ఎఫ్‌ఐడి టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 2వ క్యూ కాంప్లెక్స్ సమీపంలోని షూ కీపింగ్ సెంటర్‌లో ట్రయల్ రన్ చాలా భాగా జరిగింది.

Read Also: TTD: ఇక తిరుమలలో ఉచిత వసతి ,దర్శనం

#SrivariDarshanam #Tirumala #TirumalaUpdates #ttd #TTDNewInitiative Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.