हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Murali Nayak: మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగానూ సాయం ప్రకటించిన పవన్

Anusha
Murali Nayak: మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగానూ సాయం ప్రకటించిన పవన్

భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతల వేళ దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీనాయక్ స్వగృహానికి చేరుకుని, ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. పవన్‌తో పాటు మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సవిత వారి కటుంబాన్ని ఓదార్చారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని(Bronze statue) కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 Murali Nayak: మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగానూ సాయం ప్రకటించిన పవన్
Murali Nayak: సాయం ప్రకటించిన పవన్

ఆర్థిక సహాయం

వ్యక్తిగతంగాను పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు. ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మురళీనాయక్(Murali Nayak) కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు.ఇక మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రి సవిత రూ. 5 లక్షలు అందించగా బాలకృష్ణ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామం కళ్లితండాను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

Read Also :Murali Nayak : మురళీ కుటుంబాన్ని ఓదార్చిన సింగర్ మంగ్లీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870