Pawan Kalyan: సర్జరీ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు.. ఆ పనులు వేగవంతం చేయాలని ఆర్డర్!

Follow Us: Google News Daily Hunt
Pawan Kalyan reviews AP progress
Pawan Kalyan reviews AP progress
FONT SIZE
GET APP

Pawan Kalyan: సర్జరీ పూర్తి అయిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ తన అధికారిక బాధ్యతల్లో బిజీగా మారిపోయారు. రెండు రోజులుగా తన క్యాంపు కార్యాలయంలో ఆయన వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

Read also: Child marriage: చిన్న వయసులోనే పెళ్లి పీటలు.. ఏపీ, తెలంగాణలో ఘోరంగా పెరుగుతున్న చైల్డ్ మ్యారేజెస్!

Pawan Kalyan reviews AP progress
Pawan Kalyan reviews AP progress

Pawan Kalyan: పల్లె పండుగ పనులపై చర్చ

గ్రామాల్లో జరుగుతున్న వీబీ-జి రామ్ జి ప్రాజెక్టులతో పాటు పల్లె పండుగ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

సరికొత్త లుక్‌లో డిప్యూటీ సీఎం

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ దట్టమైన గడ్డంతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇప్పుడు ఆ గడ్డాన్ని కాస్త ట్రిమ్ చేసి కొత్త లుక్‌లోకి మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి ఫార్మల్ డ్రెస్‌లో ఎంతో హుందాగా ఈ అధికారిక సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు