Vijayawada news:దుర్గమ్మవారి ఆలయంలో యోగాంధ్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వుల ప్రకారం ప్రారంభించిన ఈ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం ప్రముఖ యోగా అధ్యాపకులు గర్రె రాజేష్ ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు, మనస్సును ప్రశాంతపరిచే యోగాధ్యయనానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు.
Read also: Breaking News: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అత్యవసర భేటీ!

వేదోక్తంగా సూర్యోపాసన సేవ, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ఉదయము సూర్యోపాసన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. లోక క్షేమ కల్యాణార్థం రంగులతో ఆదిత్య మండల యంత్రం ముగ్గు వేసి సూర్యనమస్కారములతో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా అరుణ మహాసౌర పారాయణలు ఆదిత్య హృదయం అష్టోత్తర శతనామావళితో మంగళవాయిద్యముల నడుమ సూర్య భగవానుడికి గోదుమ పాయసం నివేదించి భక్తులకు ప్రసాద పంపిణి వేదాశీర్వాదం చేశారు. సూర్యోపాసన అనంతరం కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సూర్యోపాసన వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగా అధికారిక మనమిత్ర వాట్సాప్ సేవలు యందు దబ్లుడబ్లుడబ్లు. కనకదుర్గమ్మ. ఓఆరిజి వెబ్సైట్ ద్వారా లేదా దేవస్థానం కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని ఇఓ తెలిపారు.
Vijayawada news:ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్త జనం
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వేసవి సెలవులు, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్ క్యూలైన్లు పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.
దుర్గమ్మవారి సేవలో రాజ్యసభ ఎంపి అభ్యర్థి
దుర్గమ్మవారిని రాజ్యసభ ఎంపి అభ్యర్థి చింతకాయల విజయ్ ఆదివారం దర్శించుకు న్నారు. ఆలయ పండితులు ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించి, అమ్మ వారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని బహుకరించారు.
విరాళాలు
విశాఖపట్నంకు చెందిన ఏ బిజీ అమిత్ రెడ్డి, భవ్య ఆదివారం రూ.1,00,000 విరాళాన్ని నిత్య అన్నదాన పథకంకు అందించారు. విజయ వాడకు చెందిన సోలా దుర్గారావు దంపతులు రు. 2లక్షలను నిత్యాన్నదాన పథకానికి విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన జె దేవీ సుప్రజా దంపతులు రు.1లక్ష విరాళం నిత్యా న్నదాన పథకానికి విరాళమందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం వారికి దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మె మొంటో అందించారు. వేదపండితులు వేదాశీర్వ చనాలు పలికారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: