हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు

Vanipushpa
విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు

విజయవాడ వాసులకు తీపికబురు. విజయవాడ నుంచి దుబాయ్‌కు త్వరలోనే విమాన సర్వీసు అందుబాటులో రానుంది. దుబాయ్ వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. విజయవాడ నుంచి దుబాయ్ విమాన సర్వీసు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ – దుబాయ్‌ విమాన సర్వీసు విషయంపై అరబ్‌ ఎమిరేట్స్‌ సంస్థ పరిశీలన జరుపుతోంది. తాజాగా అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధికారులు కూడా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డితో సంప్రదింపులు జరిపారు. దీనికి తోడు విజయవాడ నుంచి దుబాయ్‌కు ఎంత మంది ప్రయాణికులు వెళ్తుంటారు.. ట్రాఫిక్ ఎలా ఉంటుందనే దానిపైనా అరబ్ ఎమిరేట్స్ అధికారుల బృందం సర్వే జరుపుతున్నట్లు సమాచారం.

మరోవైపు విజయవాడ ఎయిర్‌పోర్టులో ఉన్న ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ను ఎమిరేట్స్‌ అధికారులు పరిశీలించారు. అలాగే పాత టెర్మినల్‌ను కూడా సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మరో ఆరు నెలల్లో పూర్తికానుంది. దీని గురించి కూడా ఎమిరేట్స్ ప్రతినిధులు వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. అయితే విజయవాడ – దుబాయ్ విమాన సర్వీసుల ప్రారంభంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎమిరేట్స్ సంస్థ సొంతంగా జరుపుతున్న సర్వే పూర్తయిన తర్వాత ఈ విషయంలో క్లారిటీ రానుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870