📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Scheme: కలలకు రెక్కలు పథకం గురించి తెలుసా!

Author Icon By Anusha
Updated: May 6, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వం విద్యార్థినుల కోసం కొత్త పథకం తీసుకురాబోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నత విద్య చదివే విద్యార్థినుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం పేరు ‘కలలకు రెక్కలు’గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెంచాలని లెక్చరర్ల కొరతను తీర్చాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తామని చెప్పారు.

గ్యారెంటీ

ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి విద్యార్థినులు రుణాలు తీసుకుంటే వాటికి ప్రభుత్వమే గ్యారెంటీగా నిలుస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో సన్మానించాలని ఆయన అన్నారు. విద్యాశాఖలో బదిలీలు ఎప్పుడూ ఎడ్యుకేషన్ ఇయర్ మొదలయ్యే ముందే పూర్తి చేయాలని లోకేష్ సూచించారు.

కాల్ సమస్య

పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించాను. డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎలాంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పదోతరగతి పరీక్షా ఫలితాలపైనా సమీక్షించాను. ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలి. అంబేద్కర్ విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభానికి విధివిధానాలు రూపొందించాలి. ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తాం. ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించాను’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

Read Also: Andhra Pradesh: ఏపీ యువతకు ప్రభుత్వం శుభవార్త

#AndhraPradesh #EducationForAll #ScholarshipsForWomen #StudyAbroad #WomenEmpowerment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.