📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Security: సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా ప్రజలు, సంస్థలు, ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీలు) రక్షణపై ఉన్నతాధికారులు సమీక్షించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రతో కలిసి భద్రతా చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. భద్రతా నియమాలు పక్కాగా అమలు చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. అమరావతిలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై చర్చించారు.డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో భద్రతను పెంచారు,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎక్కడా రాజీ పడవద్దు అన్నారు. భద్రతా నియమాలను పూర్తిగా పాటించాలని, ఎటువంటి అలసత్వం వహించకూడదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM ChandraBabu) ప్రజల్లోకి, బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీలకు సూచనలు చేశారు. ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ప్రత్యేక ఏర్పాట్లు ఎలా చేయాలో ఎస్పీలకు వివరించారు. ఈ భద్రతా చర్యల గురించి డీజీపీ, సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. తనకు భద్రత కల్పించే సమయంలో సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.ఇప్పటికే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి సెక్యూరిటీని పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై కేటగిరీ భద్రత ఉండగా దాన్ని ఇప్పుడు వై-ప్లస్‌ కేటగిరీకి మార్చారు. అందుకు తగిన విధంగా రాష్ట్ర పోలీసుల తరఫున ఇద్దరు గన్‌మెన్‌లతో పాటుగా మరో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు ఉంటారు. మొత్తంగా రామ్మోహన్ వెంట నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు.

Security: సీఎం చంద్రబాబు భద్రత

పోలీసులు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చర్యలు తీసుకుంది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది మరణించారని కేంద్రం తెలిపింది. ఈ ఘటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లతో మాట్లాడారు. రాష్ట్రాలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రముఖులతో పాటుగా ప్రజల భద్రతపై అధికారులు ఫోకస్ పెట్టారు.అంతేకాదు ఏపీలో తీరప్రాంతం ఎక్కువగా ఉంది.ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో కూడా భద్రతని ముమ్మరం చేశారు. నేవీతో పాటుగా మెరైన్ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో కొత్త రేషన్ కార్డు వాట్సాప్‌లోనూ అందుబాటు

#APGovernment #cmchandrababu #HighLevelMeeting #OperationSindhoor #SecurityAlert Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.