RoadSafety:రోడ్డు బాగుంటేనే ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. రహదారుల నిర్మాణంలో నాణ్యత లేకపోతే వాహనాలు త్వరగా పాడైపోతాయి, ప్రమాదాలు కూడా జరుగుతాయి. దీనిని అరికట్టడానికి నాణ్యత లేకపోతే రోడ్డు బిల్లులు ఆపేస్తారు అనే కఠిన నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ రోడ్డు నిర్మాణ పనులను ప్రతి దశలోనూ నిశితంగా పరిశీలిస్తుంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్, మోర్త్ సూచించిన ప్రమాణాల ప్రకారమే పనులు జరుగుతున్నాయో లేదో ఈ విభాగం తనిఖీ చేస్తుంది. కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి బిల్లులు పొందే అవకాశం ఇకపై ఉండదు. ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. పనుల్లో నాణ్యత నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే తదుపరి నిధులు విడుదలవుతాయి.
Read also: Senior Living Communities: వృద్ధాశ్రమాలకు ఇక చెక్ పడినట్లే

అనుమతి లేని మెటీరియల్ వాడితే ఊరుకునేదే లేదు
రహదారుల నిర్మాణానికి వాడే ప్రతి వస్తువు బోర్డ్ ఆఫ్ ఇంజినీర్స్ సిఫార్సు చేసినది మాత్రమే అయి ఉండాలి. సిమెంట్, రాయి, కంకర, స్టీల్, ఇసుక వంటి ప్రతీది నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేస్తారు. నిర్మాణం కోసం 75 ఎంఎం, 100 ఎంఎం సైజు కంకరను మాత్రమే ఉపయోగించాలి. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు పనులు ప్రారంభించే ముందే మెటీరియల్ నాణ్యతను ధ్రువీకరిస్తారు. ఏజెన్సీ అనుమతి లేకుండా కాంట్రాక్టర్లు ఏ వస్తువును వాడటానికి వీలు లేదు. ఏమైనా తేడాలు కనిపిస్తే ఆ పదార్థాలను వెనక్కి పంపించి సరైన ప్రమాణాలు ఉన్న వాటిని తెప్పిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మేజర్ డీవియేషన్ కింద పరిగణించి నివేదిక సమర్పిస్తారు. ఒకసారి అనుమతించిన ప్రక్రియను మార్చడానికి వీలు పడదు.
RoadSafety:తప్పు దొరికితే 3 రెట్ల జరిమానా తప్పదు
నిర్మాణ బాధ్యతతో పాటు రోడ్డు నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారులదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద నిర్మించే రోడ్లకు 5 ఏళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించాల్సి ఉంటుంది. ఈ సమయంలో రోడ్డు పాడైతే కాంట్రాక్టరే సొంత ఖర్చులతో బాగు చేయాలి. తారు వేయడం, గుంతలు పూడ్చడం, యంత్రాలు, కూలీల వ్యయం అంతా గుత్తేదారుడే భరించాలి. నాణ్యత పరీక్షల నివేదికలు వచ్చాకే పూర్తి స్థాయి బిల్లులు చెల్లిస్తారు. ఒకవేళ నిర్మాణంలో లోపాలు 10 శాతం లోపు ఉంటే 2 రెట్ల రికవరీ ఉంటుంది. లోపాలు 10 శాతం కంటే ఎక్కువ ఉంటే ఏకంగా 3 రెట్ల రికవరీ విధిస్తారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల నాణ్యమైన రోడ్లు అందుబాటులోకి వస్తాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: