ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ బిర్యానీ ప్రేమ గురించి, అలాగే క్రికెట్‌లో పీఆర్ హైప్ వల్ల ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

Advertisements

బిర్యానీ కోసం హోటల్ మార్చుకున్న సంఘటన

2014 ఐపీఎల్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. టీమిండియా క్రికెటర్లు ధోనీ, సురేశ్ రైనా హైదరాబాద్ లోని ప్రసిద్ధ దమ్ బిర్యానీ ను తినాలనుకున్నారు. అంబటి రాయుడు తన ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన బిర్యానీని హోటల్‌కు పంపించారు. అయితే, హోటల్ సిబ్బంది “బయట ఫుడ్ అనుమతిలేదు” అంటూ బిర్యానీని తిరస్కరించారు.ఈ విషయం ధోనీకి తెలియడంతో, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వెంటనే ఆ హోటల్‌ను మార్పించుకున్నారు. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఆ హోటల్‌లో బస చేయడం మానేశారు. ఈ సంఘటనతో ధోనీ హైదరాబాద్ బిర్యానీపై ఉన్న ప్రేమ, అలాగే తనకు నచ్చిన దానిని సాధించుకునే ధోరణి మరోసారి స్పష్టమైంది.

క్రికెట్‌లో పీఆర్ హైప్‌పై రాయుడు విమర్శలు

అంతేకాదు, రాయుడు ప్రస్తుత క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావం ఎక్కువైందని ఆరోపించారు. గతంలో నిజమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు మాత్రమే గుర్తింపు పొందేవారని, కానీ ఇప్పుడు పీఆర్ మేనేజ్‌మెంట్‌ల ద్వారా కొన్ని పేర్లు ఊచకోత కోస్తున్నాయని అన్నారు. కొందరు ఆటగాళ్లు తక్కువ ప్రదర్శన ఇచ్చినా, పెద్ద ఎలివేషన్ పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.”ఇప్పుడు ఆటను కన్నా, పీఆర్‌ల హైప్ ఎక్కువైందని,నిజమైన టాలెంట్‌కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది.” అని రాయుడు అభిప్రాయపడ్డారు.

3789ebbc ambati rayudu and ms dhoni

రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని క్రికెట్ విశ్లేషకులు “రాయుడు చెప్పింది నిజమే” అని ఒప్పుకుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తేల్చారు. ఏదేమైనా, ధోనీ హైదరాబాద్ బిర్యానీ ప్రేమ, అలాగే క్రికెట్‌లో పీఆర్ హైప్ అనే అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.కొంతమంది ఆటగాళ్లు తక్కువ ఆడినా పెద్ద ఎలెవేషన్ తీసుకుంటున్నారని విమర్శించాడు. గతంలో ఇది ఇలా ఉండేదికాదని, ఇప్పుడు మాత్రం అసలు టాలెంట్‌కు అవకాశం లేకుండా మారిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాయుడు డిమాండ్ చేశాడు.

Related Posts
ఛాంపియన్‌గా టీం ఇండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?
Team India is the champion.. How much is the prize money?.jpg

దుబాయ్‌: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఈ తరుణంలోనే 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది భారత్. Read more

ఫైన‌ల్‌ మ్యాచ్‌కి కోట్ల‌కు పైగా వ్యూస్‌
ఫైన‌ల్‌ మ్యాచ్‌కి కోట్ల‌కు పైగా వ్యూస్‌

ఫైన‌ల్‌ మ్యాచ్‌కి కోట్ల‌కు పైగా వ్యూస్‌ ఇటీవల పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతంగా ముగిసింది. పుష్కరకాలం తర్వాత మరోసారి Read more

హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన భారత క్రికెటర్
హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన భారత క్రికెటర్

విజయ్ హజారే ట్రోఫీ 2024లో కర్ణాటక జట్టు అసాధారణ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్-సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది.తాజాగా Read more

కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఎల్ఎస్‌జీ యాజమాన్యం విడుదల;
kl rahul

2025 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)లో కొనసాగుతారా అనే ప్రశ్న ఇప్పుడు ఒక పెద్ద ఉత్కంఠకు దారితీస్తోంది. Read more

×