దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఈ తరుణంలోనే 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఫైనల్‌లో కివీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

టీమిండియా ఫ్రైజ్ మనీ ఎంతంటే ?
2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియా $2.24 మిలియన్లు అంటే రూ. 20 కోట్లు గెలుచుకుంది. రెండవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ $1.12 మిలియన్లు అంటే రూ. 10 కోట్లు సంపాదించింది. కాగా, ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తాయి. ఫైనల్‌లో ఓడిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ. 9.74 కోట్లు (1.12 మిలియన్ డాలర్లు) లభిస్తాయి.
నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ
ఇక, సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయిన జట్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దాదాపు రూ. 4.87 కోట్లు (US$ 5,60,000) అందుకుంటాయి. గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానంలో నిలిచిన జట్లు (ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) సమాన మొత్తంలో $3,50,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుకుంటాయి. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లు (పాకిస్తాన్, ఇంగ్లాండ్) సమాన మొత్తంలో $1,40,000 (సుమారు రూ. 1.22 కోట్లు) అందుకుంటాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీని $6.9 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు) అందిస్తోంది. ఇది 2017 కంటే 53 శాతం ఎక్కువ.