అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో భారీ ప్రాజెక్ట్: ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ కలిసి రూపొందిస్తున్న పాన్-ఇండియా సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బన్నీ ద్విపాత్రాభినయం
ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉండనున్నాయి. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలతో తెరకెక్కనుందని తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా?
ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది.
సమంత మరో ఎంపికగా?
ప్రియాంక చోప్రా డేట్స్ కుదరకపోవడంతో, ఈ సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అటు అట్లీ, ఇటు అల్లు అర్జున్ ఇద్దరితోనూ సమంత పని చేశారు. అట్లీ దర్శకత్వం వహించిన మెర్సిల్ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. అలాగే, అల్లు అర్జున్, సమంత కాంబినేషన్‌లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది.
Read also: Shalini Pandey: రణబీర్ కపూర్ తో నటించాలనేది నా కోరిక: షాలినీ పాండే