అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ గిఫ్ట్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా, బన్నీ నటించనున్న కొత్త సినిమా ‘AA22’కు సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సంస్థ సన్ పిక్చర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనుండటం మరో ముఖ్యాంశం.

Advertisements

అట్లీ & అల్లు అర్జున్ – ఫస్ట్ టైమ్ కాంబినేషన్

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌పై గతకొంతకాలంగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ నిజమయ్యాయి. అట్లీ తన సూపర్ హిట్ ‘జవాన్’ తర్వాత నేరుగా ‘AA22’కు దర్శకత్వం వహించనున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వతా, ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వీడియోలో హై టైక్ ఎలిమెంట్స్

సన్ పిక్చర్స్ విడుదల చేసిన ప్రకటన వీడియోలో ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నట్లు చూపించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం, అట్లీ మరియు అల్లు అర్జున్ లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ VFX సంస్థను సంప్రదించినట్లు తెలియజేశారు. వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని చెప్పినట్లు వీడియోలో హైలైట్ చేశారు. వీడియోలో అల్లు అర్జున్ స్క్రీన్ టెస్ట్ విజువల్స్‌ను కూడా చూపించడం అభిమానులకు ఆనందంగా మారింది. బన్నీ లుక్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పవర్‌ఫుల్ స్టెప్స్ అన్నీ వీడియోలో చిన్న క్లిప్స్ ద్వారా చూపించారు. దాంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి మళ్లీ పెరిగింది. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ మూవీ కాగా, అట్లీకి దర్శకుడిగా ఇది ఆరవ సినిమా. అందుకే AA22xA6 అనే హాష్‌ట్యాగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక “ల్యాండ్‌మార్క్ సినిమాటిక్ ఈవెంట్”గా మలచాలని సన్ పిక్చర్స్ భావిస్తోంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న అల్లు అర్జున్ మూవీగా ఇది దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కావొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే సన్ పిక్చర్స్ పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్న సంస్థగా గుర్తింపు పొందింది. అల్లు అర్జున్ ఇప్పటికే హిందీ మార్కెట్‌లో పుష్ప సినిమాతో క్రేజ్ సంపాదించిన తర్వతా, ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ లెవెల్‌లో తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది అల్లు అర్జున్‌కు 22వ చిత్రం కాగా, అట్లీకి ద‌ర్శ‌కుడిగా 6వ మూవీ. ఈ ప్రాజెక్టు సంబంధించి త్వ‌ర‌లో అన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

Read also: Allu Arjun: కుటుంబంతో బ‌ర్త్ డే జరుపుకున్న అల్లుఅర్జున్..ఫోటోలు వైరల్

Related Posts
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
cyclone

ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. Read more

Taapsee Pannu: పేదల పై తన మనసును చాటుకున్న హీరోయిన్ తాప్సీ
Taapsee Pannu: పేదల పై తన మనసును చాటుకున్న హీరోయిన్ తాప్సీ

తాప్సీ పన్ను గొప్ప మనసు చాటారు: వేసవి కాలంలో పేదలకు సహాయం తాప్సీ పన్ను కేవలం ఒక ప్రఖ్యాత నటి మాత్రమే కాకుండా, తన మంచి హృదయంతో Read more

Keerthy Suresh: కీర్తి సురేశ్ బర్త్ డే స్పెషల్.. ‘రివాల్వర్ రీటా’ టీజర్ రిలీజ్
keerthy suresh right a poster from revolver rita 623

కీర్తి సురేశ్ తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా తన ప్రత్యేకతను చూపిస్తూ వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా Read more

Kakani : మాజీ మంత్రి కాకాణి నివాసానికి పోలీసుల నోటీసులు
Police notice issued to former minister Kakani residence

Kakani: క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌,రవాణా,నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం పై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×