Akhilesh Yadav ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav : ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మరోసారి మోదీపై నిప్పులు చెరిగారు.లక్నోలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మోదీకి ఝలక్ ఇచ్చారు.ముఖ్యంగా సుంకాల విధానం విషయంలో ప్రధాని డొనాల్డ్ ట్రంప్‌ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అఖిలేశ్ మాట్లాడుతూ ట్రంప్‌ తన దేశాన్ని కాపాడేందుకు దిగుమతులపై సుంకాలు వేశాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అలాంటి చర్యలు అవసరం,అని స్పష్టం చేశారు. చైనా దిగుమతులపై మనం కూడా ఆంక్షలు విధించాలా లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.ప్రస్తుతం భారత్ ఆర్థికంగా గందరగోళంలో ఉందన్నారు. ఉచిత రేషన్ పొందుతున్న వారి ఆదాయం ఎంత అనేది చెప్పగలరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisements
Akhilesh Yadav ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి అఖిలేశ్ యాదవ్

దేశ ఆర్థిక స్థితిగతులపై తప్పుడు గణాంకాలు చూపుతున్నారని ఆయన ఆరోపించారు.ఇక ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు గల్లంతవుతున్నాయన్నారూ.గోరఖ్‌పూర్ అయోధ్యల వక్ఫ్ భూములను బీజేపీ లాక్కొనాలని చూస్తోంది, అని తీవ్ర ఆరోపణలు చేశారు. నేరాలపై యోగి ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.ఇప్పటి పరిస్థితుల్లో యోగి సర్కార్ నేరస్తులపై సైలెంట్ గా ఉంది. ప్రజల భద్రత గురించి ఈ ప్రభుత్వానికి పట్టింపులేదనే అనిపిస్తోంది, అని వ్యాఖ్యానించారు.అఖిలేశ్ వ్యాఖ్యలతో మళ్లీ ఉత్తరప్రదేశ్ రాజకీయ వేడి పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహంతో పార్టీ దూకుడు పెంచుతోందని విశ్లేషకుల అభిప్రాయం.ఈ వ్యాఖ్యలు బీజేపీకి ఎదురుదెబ్బగా మారుతాయా? లేక అఖిలేశ్ విమర్శలు రాజకీయ మైదానంలో మరో ప్రహసనంగా మిగిలిపోతాయా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

READ ALSO : Harish Rao : బీఆర్ఎస్‌లో చేరిన పలువురు నాయకులు

Related Posts
MMTS: ఎంఎంటీస్ అత్యాచార ఘటన.. నిందితుడి గుర్తింపు
MMTs rape incident.. accused identified

MMTS : హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన Read more

పోచారం శ్రీనివాసరెడ్డి పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
jeevan reddy pocharam

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో జరుగుతున్న ఫిరాయింపులు కారణంగా ఈ ఘటన జరిగిందని.. Read more

ఈరోజు నుండి మూడు రోజుల పాటు “రైతు పండుగ”
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నుండి మూడు రోజుల పాటు ‘రైతు పండుగ’ నిర్వహించనున్నారు. Read more

సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా
Mukesh Kumar Sinha as the Chairman of CWC

న్యూఢిల్లీ: సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించిది. ఈ మేరకు డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కుందన్‌ నాథ్‌ ఉత్తర్వులు జారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×