ప్రమాదంలో హైదరాబాద్‌ వాతావరణం!

ప్రమాదంలో హైదరాబాద్‌ వాతావరణం!

హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమై ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా, సనత్‌నగర్‌లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 24న సనత్‌నగర్‌లో ఏకంగా 431 ఎక్యూఐ( ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) నమోదైంది. ఈ స్థాయిలో కాలుష్యం ఉండడం ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారనుందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ( టిఎస్ పిబి) అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisements

వాయు కాలుష్య స్థితిగతులు

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యతను పరిశీలించినప్పుడు.నగరంలో సగటున 108 ఏక్యూఐ నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. జూపార్క్‌లో 135, పటాన్ చెరువులో 112 తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లలో ఎక్కడా 100 ఏక్యూఐ దాటలేదని అధికారులు స్పష్టం చేశారు. సగటున 108 ఏక్యూఐ నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. జూపార్క్‌లో 135, పటాన్ చెరువులో 112 తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లలో ఎక్కడా 100 ఏక్యూఐ దాటలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో గాలి నాణ్యత 0 నుంచి 50లోపు నమోదైతే ఆ గాలి స్వచ్ఛంగా ఉన్నట్టని.. అదే 51 నుంచి 100 వరకు ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని తెలిపిన అధికారులు.. 101 నుంచి 200 మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరమని, 200 నుంచి 300 వరకు ఉంటే పూర్ క్వాలిటీ అని, 301 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ క్వాలిటీ అని పేర్కొన్నారు. 401 నుంచి 500  వరకు ఉంటే మాత్రం అది అత్యంత ప్రమాదకర స్థాయి అని చెప్పుకొచ్చారు.

సనత్‌నగర్‌లో గాలి నాణ్యత ఎప్పుడూ సాధారణంగా ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో, అక్కడి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు విపరీతంగా కాలుష్య ఉద్గారాలను వదులుతున్నాయి. అయితే, గతంలో ఎప్పుడూ లేనంతగా 400 ఎక్యూఐ మార్క్ దాటడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

1941839 hyderabad going the delhi way

వాయు కాలుష్యం వల్ల ఆరోగ్యపరమైన అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా:

శ్వాసకోశ వ్యాధులు – ఉబ్బసం , బ్రాంకైటిస్ వంటి వ్యాధులు పెరుగుతాయి.
గుండె సంబంధిత సమస్యలు – కాలుష్య కారకాలు రక్తనాళాలపై ప్రభావం చూపి గుండెపోటుకు కారణం కావచ్చు.
తలనొప్పి, అలసట, కళ్లు మండటం – అధిక కాలుష్యం కారణంగా వెంటనే ప్రభావితమయ్యే సమస్యలు.
చర్మ సమస్యలు – కాలుష్యంతో చర్మం ముడతలు పడటం, అలర్జీలు రావడం.
ఇమ్మ్యూనిటీ తగ్గిపోవడం – దీర్ఘకాలికంగా కాలుష్య ప్రాబల్యం ఎక్కువైతే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన నియమాలు అమలు చేయాలి.
కాలుష్య కారక గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎన్విరాన్‌మెంటల్ మానిటరింగ్ చేపట్టాలి.
నగరంలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించాలి.
మెట్రో, ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని ప్రోత్సహించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయాలి.
మరింత హరిత ప్రణాళికలు అమలు చేసి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి.

Related Posts
Metro Charges : హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !
Hyderabad Metro fares hiked!

Metro Charges : హైదరాబాదులో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్‌ షాక్‌ అని చెప్పాలి. మెట్రో ఛార్జీలు పెంపకం తథ్యమని తెలుస్తోంది. అతి త్వరలోనే Read more

hyderabad : తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం: స్మితా సబర్వాల్
hyderabad తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం స్మితా సబర్వాల్

hyderabad : తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం: స్మితా సబర్వాల్ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించేలా నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా Read more

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు.సీసీ కెమేరాల్లో రికార్డు అయిన Read more

బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా కె.పి. వివేకానంద, సత్యవతి రాథోడ్
sathyavathi rathod and vivekananda

తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కె.పి. వివేకానంద Read more

Advertisements
×