యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

ప్రేమికుల దినోత్సవం రోజునే ఏపీలో దారుణం జరిగింది ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేసి, అనంతరం యాసిడ్ దాడికి తెగబడిన ఘటన అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపింది. ప్రేమికుల దినోత్సవం రోజున జరిగిన ఈ అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

deccanherald 2024 11 11 53vd27zu iStock 1360341752

గౌతమిపై ప్రేమ పేరుతో వేధింపులు:
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి, మదనపల్లెలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. అయితే, మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ ఆమెను ప్రేమించమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు.

వివాహ నిశ్చయం – ప్రేమోన్మాది కిరాతక పథకం:
ఫిబ్రవరి 7న గౌతమికి పెళ్లి నిశ్చయం కాగా, ఏప్రిల్ 29న పీలేరుకు చెందిన శ్రీకాంత్‌తో వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన గణేష్ ఆమెను వేధించడం మితిమీరడంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. యువతికి వివాహం నిశ్చయమైందని తెలుసుకుని ఇలా దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

దారుణ దాడి :
ఫిబ్రవరి 14న, గౌతమి తల్లిదండ్రులు పాలు పిండటానికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా తీసుకుని గణేష్ ఆమె ఇంట్లోకి చొరబడి, కత్తితో తలపై దాడి చేశాడు. దాంతో ఆగకుండా యాసిడ్ దాడికి కూడా పాల్పడ్డాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు:
దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని గౌతమి వివరాలు తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి అమానుష దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నారా లోకేశ్ సమీక్ష
nara lokesh

ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ Read more

బర్డ్ ఫ్లూ పై మితిమీరిన భయాలు వద్దు: అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ పై మితిమీరిన భయాలు వద్దు: అచ్చెన్నాయుడు

ఏపీలో ఇప్పుడు చికెన్ పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో చికెన్ తినాలంటే ఆలోచిస్తున్నారు. అంతే Read more

కుట్రలో చంద్రబాబు భాగస్వామి అంటూ షర్మిల వ్యాఖ్యలు
కుట్రలో చంద్రబాబు భాగస్వామి అంటూ షర్మిల వ్యాఖ్యలు

కుట్రలో చంద్రబాబు భాగస్వామి అంటూ షర్మిల వ్యాఖ్యలు పోలవరం ప్రాజెక్టు విషయంలో గందరగోళం రేపుతూ చంద్రబాబునాయుడి పాత్రను నిర్ధారించడం వలన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల Read more

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
Extension of application de

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు పెంచినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ Read more