హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులకు లావణ్య అందించిన హార్డ్ డ్రైవ్ లో మస్తాన్ సాయి బాగోతాలన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీ వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో గుంటూరులో రాహుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో ఎండీఎంఏ డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుంచి మస్తాన్ సాయి, చింటూ ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరి ఆర్డర్ మేరకు 130 గ్రాముల డ్రగ్స్ ను గుంటూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఖాజ వాటిని లావణ్య ఇంట్లో పెట్టాడు.

ఈ కేసులో ఖాజాను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు అతనికి 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఈ క్రమంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డ్రగ్స్ ను తీసుకుని ఖాజా పరారయినట్టు సమాచారం. దీంతో, ఖాజాతో పాటు మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మస్తాన్ సాయి కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు అమ్మాయిలతో అసభ్యం గా ఫోటోలు వీడియోలు రికార్డు చేసిన మస్తాన్ సాయి గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు లో అరెస్ట్ అయినా మస్తాన్ సాయి అంతే కాకుండా గతంలో ఏపీ కూడా డ్రగ్స్ కేసు లో మస్తాన్ సాయి ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి మస్తాన్ సాయి ని అరెస్ట్ తో మళ్లీతెరపైకి వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.