RG Medical College incident.. Petition in Supreme Court today.

ఆర్‌జీ మెడికల్‌ కాలేజీ ఘటన.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌..!

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. ట్రైనీ డాక్టర్‌ తల్లిదండ్రుల పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణను మార్చి 17న చేపట్టనున్నది. జనవరి 20న ఆర్‌జీ ఖర్‌ కేసులో దిగువ కోర్టు శిక్షను విధించిన విషయం తెలిసిందే.

Advertisements
image

కేసులో దోషిగా తేలిన సంజయ్‌ రాయ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించింది. సీల్దా కోర్టు సంజయ్‌ రాయ్‌కి రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ మృతదేహం సెమినార్‌ హాల్‌లో కనిపించింది. లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజున ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది.

Related Posts
ABV: రాజకీయాల్లోకి వస్తున్న ఏబీవీ..వెనుకుండి నడిపిస్తున్న వారెవరు?
ABV: రాజకీయాల్లోకి వస్తున్న ఏబీవీ..వెనుకుండి నడిపిస్తున్న వారెవరు?

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఆయన, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ఎదుర్కొన్న Read more

NarendraModi: ఏప్రిల్ 3 న థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన..
NarendraModi: ఏప్రిల్ 3 న థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుండి 6 వరకు థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. Read more

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం
CM Revanth Reddy will go to Maharashtra today

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ ముందు నుండి కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి , డ్రగ్స్ , Read more

కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నిక విజయశాంతి
కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నిక విజయశాంతి

కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నిక విజయశాంతి తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఎలాంటి పోటీ లేకుండానే పూర్తయ్యాయి.ఎన్నికల ప్రక్రియలో ఐదు స్థానాలకు కేవలం ఐదుగురు Read more

Advertisements
×