ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ యువకుడిని డాక్టర్ ముబారిక్ తన కారులోనే సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్ అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయాడు.విచారణలో అతడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు డాక్టర్ ముబారిక్ బాగ్‌పత్‌లోని ఒక గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నాడు.అతనికి రూ.20 లక్షల నుంచి 25 లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది.అప్పుల భారం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు ఓ యువకుడిని తన కారులో తీసుకొని,సజీవ దహనం చేశాడు.డిసెంబర్ 22 నుంచి కనిపించకుండా పోయిన సోను అనే యువకుడు, డిసెంబర్ 26న అతడి మామ గుల్జార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో, బిజోపురా కాలువ వంతెన సమీపంలో పగిలిన కారు కనుగొనబడింది.కారులో దగ్ధమైన మృతదేహం కనిపించిన వెంటనే, పోలీసులు అనుమానిత డాక్టర్ ముబారిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో, నిందితుడు డాక్టర్ ముబారిక్ తన అప్పుల భారం నుంచి బయటపడటానికి, దుర్మార్గమైన ప్లాన్‌ను అమలు చేసినట్లు చెప్పాడు. తన కారులో సజీవంగా దహనమయ్యేలా ఓ యువకుడిని తీసుకెళ్లి, అతడిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మృతుడు సోను, డిసెంబర్ 22న నుంచి కనిపించకుండా పోయాడు. అతడి మృతదేహం కారులో దగ్ధమైన సమయంలో, డాక్టర్ ముబారిక్ సంఘటనాస్థలానికి చేరుకుని, పోలీసుల వద్ద తాను అదే కారు యజమానిని అనీ, దర్యాప్తు చేస్తే విషయం బయటపడింది. ఈ ఘాతుకంతో మృతుడు సోనూ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు గుండెలు నొప్పితో విలపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, విచారణను కొనసాగిస్తున్నారు.