Telangana government issues key orders on Yasangi crops!

యాసంగి పంటలపై తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు !

హైదరాబాద్‌: యాసంగి పంటలపై తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్ధవంతంగా జరిగేలా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు శాంతి కుమారి. గతేడాదితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో నీటి లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్‌ను బాగా చూసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

Advertisements
యాసంగి పంటలపై తెలంగాణ సర్కార్‌

రైతులకు అవగాహన

రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని, విద్యుత్ సరఫరాలో ప్రస్తుత పరిస్థితి సౌకర్యవంతంగా ఉందన్న సీఎస్ జిల్లాలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో సమర్ధవంతమైన నిర్వహణ ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యేవేక్షించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా తగినంత పరిమాణంలో ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

21 చోట్ల కొనుగోలు కేంద్రాలు

కాగా, రాష్ట్రంలో రైతు పండించిన పంటలు కేంద్రం కొనుగోలు చేయకపోయినా సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇప్పటికే ప్రొద్దు తిరుగుడు సేకరణ మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో 21 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదు చోట్ల ప్రారంభించామని తెలిపింది. పంట కోతల ప్రకారం మిగతా సెంటర్ల కూడా ప్రారంభిస్తామని, పొద్దు తిరుగుడు పండించిన రైతులు మార్కెట్​ ప్రమాణాలకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి మద్దతు దర పొందాలని కోరింది. ప్రతిపక్ష పార్టీ నేతలపై పొద్దు తిరుగుడు కోనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొనడం సరికాదని తెలిపింది.

Related Posts
ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందే: సుప్రీంకోర్టు
Amaravati capital case postponed to December says supreme court jpg

Supreme Court న్యూఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ Read more

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితుల‌కు బెయిల్!
allu

న‌టుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్ప‌డిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బ‌న్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, Read more

సల్మాన్ బతికుండాలంటే రూ. 5 కోట్లు ఇవ్వండి – పోలీసులకు మెసేజ్
salman 5cr

సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు Read more

వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

అమరావతి: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవీందర్‌రెడ్డిని Read more

×