వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

అమరావతి: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవీందర్‌రెడ్డిని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన రవీందర్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఫిర్యాదుల మేరకు అతనిపై పలు కేసులు నమోదయ్యాయి.

Advertisements
వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

వర్రాకు వైద్యపరీక్షలు

ఎన్టీఆర్‌ జిల్లా షేర్‌మహమ్మద్‌పేటకు చెందిన ఎనికే గోపి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు వర్రాపై ఐటీ యాక్ట్‌ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసులో భాగంగా చిల్లకల్లు పోలీసులు కడప జైలుకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కడప జైలు అధికారులు వర్రాకు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించారు. బుధవారం ఆయన్ను జగ్గయ్యపేట కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ వధించారు. అనంతరం జగ్గయ్యపేట సబ్‌జైలుకు ఆయన్ను తరలించారు.

Related Posts
బీరెన్‌సింగ్‌ రాజీనామా.
బీరెన్‌సింగ్‌ రాజీనామా.

మణిపూర్‌ సీఎం తన పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ లో జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలోని గొంతుకు ఆయన గొంతుకు 93 Read more

ఢిల్లీ సీఎం ఎవరు?.. వినిపిస్తున్న పేర్లు ఇవే..?
Who is the CM of Delhi?.. These are the names being heard..? .jpg

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ Read more

హస్తినను హస్తగతం చేసుకునేది ఎవరు?
elections

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని Read more

వయనాడ్ బరిలో సినీ నటి ఖుష్బూ..?
kushboo

వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో సినీ నటి ఖుష్బూను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి ఆమె దీటైన పోటీ ఇస్తుందనే Read more

Advertisements
×