మహిళలకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు..ఎక్కడ అంటే?

మహిళలకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు..ఎక్కడ అంటే?

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అండగా ఉండేందుకు మరో సంచలన నిర్ణయానికి తెరతీసింది. అధికారంలో ఉన్న సుఖ్వీందర్ సుఖు మహిళల సంక్షేమం కోసం పలు పథకాలను తీసుకుని వస్తున్నారు. తాజాగా ఇప్పటినుంచి మహిళా ఉద్యోగులకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు మంజూరు చేయనుంది. అయితే ఈ సెలవులు అందరు మహిళా ఉద్యోగులకు మాత్రం కాదని హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తేల్చి చెప్పింది. గర్భిణీలకు డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా డెలివరీ తర్వాత బిడ్డను కోల్పోయిన ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు ఈ 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవును ఉంటుందని స్పష్టం చేసింది.
6 నెలలు ప్రసూతి సెలవులు
దీనికి సంబంధించి తాజాగా సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకు 180 రోజులు (6 నెలలు) ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. అయితే ఈ ప్రసూతి సెలవులకు ఎలాంటి అర్హతలు ఉండాలో.. కొత్తగా ప్రకటించిన ప్రత్యేక ప్రసూతి సెలవులకు కూడా అవే అర్హతలు అని హిమాచల్ సర్కార్ వెల్లడించింది. కానీ ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు మాత్రం డెలివరీ సమయంలో లేదా ఆ తర్వాత పుట్టిన శిశువు చనిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

Advertisements
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే

అయితే గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో డెలివరీలు చేసుకున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 9 నెలల పాటు కడుపులో మోసిన బిడ్డ.. కళ్లు తెరిచే సమయంలో, తెరిచిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం అంటే ఆ తల్లికి.. అంతకుమించిన శోకం ఇంకోటి ఉండదని హిమాచల్ ప్రభుత్వం తెలిపింది. అందుకే అలాంటి తీవ్ర విషాదకరమైన పరిస్థితుల కారణంగా వారికి కలిగే శారీరక, మానసిక బాధ నుంచి బయటికి వచ్చేందుకు ఈ 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవ్స్ ఉపయోగపడుతాయని పేర్కొంది.
ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహిళల ఆరోగ్యం, వారి శ్రామిక శక్తిని ఉపయోగించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతుందని తెలిపాయి. ఇక ఇలాంటి విధానాన్ని తీసుకురావడం ద్వారా మంచి పాలనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వెల్లడించాయి

Related Posts
Yasin Malik : నేను ఉగ్రవాదిని కాదు..రాజకీయ నాయకుడిని: మాలిక్‌
I am not a terrorist, I am a politician.. Malik

Yasin Malik: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుప్రీం కోర్టు విచారణకు Read more

కేంద్ర బడ్జెట్‌పై నేడు అఖిలపక్ష సమావేశం
కేంద్ర బడ్జెట్‌పై నేడు అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభనికి ముందు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతాయని, సమావేశాలు సజావుగా సాగేందుకు Read more

ఢిల్లీలో పేలుడు కలకలం
Delhi CRPF School Incident

ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ వద్ద భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. పేలుడు ధాటికి Read more

ఢిల్లీ ప్రచారంలో యోగీ ఎంట్రీతో కీలక మలుపు
yogi adityanath

ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముందుగానే ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ విజయం తమ Read more