Headlines
ttd

టీటీడీలో కొనసాగుతున్న అంతర్గత గొడవలు

ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అంతర్గత గొడవలు కొనసాగుతూనే వున్నాయి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం కూడా రచ్చ రచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు చెరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్లే టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు.

ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలిని పాలక మండలి సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం! తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో… శుక్రవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలక మండలి భేటీ అయ్యింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన సభ్యులు… ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా ‘అధికారులు వర్సెస్‌ పాలకమండలి’గా మారింది. సమావేశ ప్రారంభంలోనే చైౖర్మన్‌ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారని… ప్రజా క్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘పాలక మండలి సభ్యులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందేనని… ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏమిటో, దీనిని ఏ రకంగా నిర్వహించదల్చుకున్నారో తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Link. Warehouse. While waiting, we invite you to play with font awesome icons on the main domain.