తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) భక్తులకు ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. ఈ నెల 10న ప్రారంభమైన టోకెన్ల ప్రక్రియకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్ద ఉదయం నుండి భక్తులు భారీగా గుమిగూడడం ప్రారంభమైంది. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట జరుగగా..నలుగురు భక్తులు మృతి చెందారు.
తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళ ఈ తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైంది. టీటీడీ సిబ్బంది వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మల్లిక మృతితో పాటు మరో నలుగురు భక్తులు కూడా మృతి చెందినట్లు సమాచారం. అలాగే పలువురికి తీవ్ర గాయాలు కావడం తో వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించినప్పటికీ, టోకెన్ల కోసం భారీగా గుమిగూడిన భక్తులను సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమయ్యారు. తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీసు బలగాలను తరలించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు టీడీపీ కల్పించనున్నది. కల్పించనున్నది. ఈ నెల 9న తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని కౌంటర్లలో ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం తరలివచ్చారు. దాంతో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా పార్కులో సిబ్బంది వారిని ఉంచారు. భక్తులను పద్మావతి పార్క్ నుంచి క్యూలైన్లలోకి వదిలే సమయంలో తొక్కిసలాట జరిగినట్లు సాక్షులు చెపుతున్నారు.