Headlines
Redmi Note 14 5G series celebrates ₹1000 crore milestone

రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్‌లో ₹1000 కోట్ల మైలురాయి సంబరాలు

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్‌ X Alot బ్రాండ్‌ షౌమీ ఇండియా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఆవిష్కరణలను పునర్‌నిర్వచిస్తూ అంతర్జాతీయంగా సరికొత్త ఫోన్‌ రెడ్‌మీ 14C 5G ఆవిష్కరిస్తున్నట్టు నేడు ప్రకటించింది. అత్యాధునిక ఫీచర్లు, నిరంతరాయ పనితీరు, అత్యంత వేగవంతమైన 5G కనెక్టివిటీ అందించేలా డిజైన్ చేసిన రెడ్‌మీ 14C 5G పెరుగుతున్న భారతీయ వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు సిద్ధంగా ఉంది. వినియోగదారుల అచంచలమైన నమ్మకం, ప్రేమకు నిదర్శనంగా భారత్‌లో రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్‌ ఆవిష్కరించిన కేవలం రెండు వారాల్లోపే ₹1000 కోట్ల ఆదాయ మైలురాయిని దాటి తిరుగులేని విజయం సాధించిన సందర్భంగా దానికి అనుబంధంగా ఈ రెడ్‌మీ 14C 5G విడుదల జరుగుతోంది.

image
image

కొత్తదనం, చక్కదనపు అద్భుత సమ్మేళనం రెడ్‌మీ 14C 5G. 600 నిట్స్‌ గరిష్ట ప్రకాశం, 17.5సెం.మీ (6.88-ఇంచెస్‌) HD+ డాట్ డ్రాప్ డిస్‌ప్లేతో స్ట్రీమింగ్, గేమింగ్ లేదా బ్రౌజింగ్ సమయంలో శక్తివంతమైన, మైమరపింపజేసే విజువల్స్‌ను ఇది అందిస్తుంది. 4nm ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన స్నాప్‌డ్రాగన్ 4జెన్‌ 2 5G ప్రాసెసర్‌ శక్తి కలిగిన ఈ డివైస్‌ అత్యుత్తమ సామర్ధ్యం, పనితీరు అందిస్తుంది. 12GB RAM (6GB + 6GB పొడిగింపు), 128GB UFS 2.2 స్టోరేజ్‌తో మల్టీటాస్కింగ్‌, గేమింగ్‌, యాప్‌ నేవిగేషన్‌ను ఎంతో సునాయాసంగా నిర్వహించుకోవచ్చు. అంతే కాదు దీని మైక్రోSD కార్డ్‌ స్లాట్‌ 1TB స్టోరేజ్‌ వరకు సపోర్టు చేస్తూ మీ అవసరాలకు కావాల్సినంత స్పేస్‌ అందిస్తుంది.

ఎటువంటి లైటింగ్‌లోనైనా వినియోగదారులు రెడ్‌మీ 14C 5G 50MP ఎఐ-డ్యుయల్‌ కెమెరా సిస్టమ్‌తో చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ కలిగిన 5160mAh బ్యాటరీతో రోజంతా దీనితో నిరంతరాయంగా పనిచేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 14పై పనిచేసే షౌమీ హైపర్‌OS చక్కని యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ అందిస్తూ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తూ దీర్ఘకాలిక మన్నికకు భరోసా ఇస్తుంది.

ధర, లభ్యత: రెడ్‌మీ 14C 5G జనవరి 10, 2025 నుంచి Mi.com, Amazon.in, ఫ్లిప్ కార్ట్, అధీకృత షౌమీ రిటెయిల్ భాగస్వాముల దగ్గర లభిస్తుంది. 4GB +64 GB రకం రూ. 9,999కి, 4GB + 128 GB రకం రూ.11,999 6GB+ 128 GB రకం రూ.11.999 లభిస్తుంది. అసమానమైన ఆవిష్కరణ, పనితీరు, డిజైన్‌తో మిడ్‌-రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇటీవలే ఆవిష్కరించిన రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్ ప్రతిభ పునర్నిర్వచనాన్ని కొనసాగిస్తోంది.

గోరిల్లా® గ్లాస్‌ విక్టస్‌® 2, IP69 సపోర్టు, అత్యాధునిక సాలిడ్‌ ఎలక్ట్రోలైట్‌ బ్యాటరీ టెక్నాలజీతో ఈ సెగ్మెంట్‌లో అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తూ తిరుగులేని మన్నిక, భద్రతతో రెడ్‌మీ నోట్‌ 14 ప్రో 5G సిరీస్‌ బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసింది. 120Hz ఆమోలెడ్‌ డిస్‌ప్లేతో ఏ లైట్‌లోనైనా అద్భుతమైన విజువల్స్‌ అందిస్తూ, ప్రతీసారి అద్భుతమైన షాట్స్‌ తీసేందుకు 50MP సోనీ LYT-600 కెమెరా సెటప్‌తో రెడ్‌మీ నోట్‌ 14 5G సెగ్మెంట్‌లో ఆకర్షణీయంగా నిలుస్తోంది. వినియోగదారులందరికీ అత్యాధునిక పనితీరు, చక్కని డిజైన్‌ అందించాలన్న షౌమీ ఇండియా అచంచలమైన నిబద్ధతకు ప్రతిరూపంగా రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్, రెడ్‌మీ 14C 5G నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Military installs temporary pier in gaza for aid. Dealing the tense situation. Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam.