పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. గతేడాది భారీ విజయాన్ని అందించిన కల్కి 2898 AD తర్వాత ఇప్పుడు ఆయన రాజా సాబ్ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.వరుస విజయాలతో పాటు, బిజీ షెడ్యూల్స్‌తో ప్రభాస్ నిరంతరం ముందుకు సాగుతున్నారు. ఆయన చేస్తున్న ప్రాజెక్టుల్లో రాజా సాబ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. హారర్ కామెడీ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా, సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రంపై ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రాజా సాబ్ ఆడియో లాంచ్ జపాన్‌లో జరగబోతుందని, ఈ సందర్భంగా జపనీస్ వెర్షన్‌లో ఓ పాట రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాలో డ్యూయెట్ సాంగ్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో పాటుగా ఓ ట్రాక్, అలాగే ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటాయని వెల్లడించారు. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభాస్ తాజాగా మాస్, యాక్షన్ చిత్రాలతో మెప్పించగా, రాజా సాబ్ చిత్రంలో ఆయన వింటేజ్ “డార్లింగ్”గా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ మరింత స్టైలిష్ లుక్‌లో దర్శనమివ్వనున్నారు, ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. రాజా సాబ్ చిత్రం ప్రభాస్ అభిమానుల్లో ఇప్పటికే అంచనాలను భారీగా పెంచింది. మారుతి దర్శకత్వంలో హాస్యం, హారర్ కలగలిపిన కంటెంట్‌తో పాటు ప్రభాస్ మాయాజాలం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తోంది.