వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా గ్రాండ్‌గా జనవరి 14 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిల్ రాజు తన సొంత పట్టణం నిజమాబాద్‌లో భారీగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా రిలీజ్ కావడం తో మంచి బజ్ ఏర్పడింది.
,
ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ సందడి చేశారు. తనదైన శైలిలో డాన్సులు వేయడమే కాకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సినిమాలో ఐశ్వర్య తనను తెగ కొట్టిందని చెప్పారు. ‘పెళ్లాలకి అల్జీమర్స్ వచ్చినా భర్తల ఫ్లాష్ బ్యాక్స్ మాత్రం మర్చిపోరు. దయచేసి మీ పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు’ అంటూ డైలాగ్ చెప్పారు. సినిమా అదిరిపోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాను అందించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు మాదిరిగా రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలను జొప్పించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారనే విషయం స్పష్టమైంది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ, వెంకటేశ్ మధ్య కెమిస్ట్రీ హిలేరియస్‌గా ఉందనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది.