Headlines
Election Commission released the list of voters

ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం

హైదరాబాద్: తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. జాబితా ప్రకారం, తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు, 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

వీరిలో 5,45,026 మంది 18-19 సంవత్సరాల ఓటర్లు, 2,22,091 మంది 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు, 3,591 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 5,26,993 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.

image
image

ఈ గణాంకాలు పంచాయతీ ఎన్నికల అవసరాల కోసం ప్రత్యేకంగా సర్వే చేసి సేకరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ జాబితా విడుదలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావడానికి పార్టీలన్నీ మరింత చురుగ్గా వ్యవహరించనున్నాయి. ఓటింగ్ హక్కు పట్ల అవగాహన పెంచుతూ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

సవరించిన ఓటర్ల జాబితా వివరాలు..

.మొత్తం ఓటర్లు- 3,35,27,925
.పురుష ఓటర్లు- 1,66,41,489
.మహిళా ఓటర్లు -1,68,67,735
.థర్డ్ జెండర్ ఓటర్లు- 2,829
.18-19 సంవత్సరాల ఓటర్లు -5,45,026
.85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు -2,22,091
.ఎన్ఆర్ఐ ఓటర్లు -3,591
.దివ్యాంగ ఓటర్లు -5,26,993

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faqs zum thema wellensittich käfig einrichten. Jakim producentem suplementów diety jest ioc ?. Advantages of overseas domestic helper.